Iran-America | బలప్రయోగానికి కూడా వెనుకాడబోం.. అణు చర్చల వేళ ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
Iran-America | ఇరాన్‌కు అగ్రరాజ్యం అమెరికా కీలక హెచ్చరికలు చేసింది. ఇరాన్‌తో జరిగే అణు చర్చలు విఫలమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.
International | Published On Feb 6, 2026, 3.42 pm IST
Iran-America | ఇరాన్‌కు అగ్రరాజ్యం అమెరికా కీలక హెచ్చరికలు చేసింది. ఇరాన్‌తో జరిగే అణు చర్చలు విఫలమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, అమెరికా, ఇరాన్ (Iran-America) మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ ఇరుదేశాల ఉన్నతాధికారులు అణు చర్చల కోసం త్వరలోనే ఒమన్‌లో భేటీ కానున్నారు. అయితే, ఈ చర్చలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. ప్రపంచ నాయకులు పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం కోసం తమ అధ్యక్షుడు ట్రంప్ ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ చర్చలు విఫలమైతే బల ప్రయోగానికి కూడా ట్రంప్ వెనుకాడబోరన్నారు.
వెంటనే ఇరాన్‌ను వీడండి..
ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ తమ పౌరులకు అమెరికా కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌లో ఉంటున్న అమెరికా పౌరులు, దౌత్యవేత్తలు, ఇతర అధికారులు వెంటనే టెహ్రాన్‌ను వీడాలని హెచ్చరించారు. అయితే, ఇరాన్‌ను వెంటనే వీడటం వీలుకాకపోతే.. సురక్షిత ప్రాంతానికైనా వెళ్లాలని సూచించింది. ఆహారం, నీళ్లు, మెడిసిన్స్‌ను అందుబాటులో పెట్టుకోవాలని సూచించింది.
అమెరికా హెచ్చరికలతో టెన్షన్ టెన్షన్..
తమ పౌరులకు అమెరికా ఇలాంటి అడ్వైజరీ జారీ చేయడంతో పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






