రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం పుతిన్ ఢిల్లీకి చేరుకుంటారు. 2021 లో చివరిసారిగా ఆయన భారత్‌ను సందర్శించినా.. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయిన తర్వాత మాత్రం భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గురువారం సాయంత్రం ఢిల్లీలో ల్యాండ్ కాగానే ప్రధాని మోదీ ఇచ్చే విందుకు పుతిన్ హాజరుకానున్నారు. ఆ తర్వాత శుక్రవారం మొత్తం ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల గురించి ఈ పర్యటనలో మోదీతో పుతిన్ చర్చించనున్నారు. 23వ భారత్ – రష్యా సమ్మిట్‌లో పుతిన్ పాల్గొంటారు. భారత్ – రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం, రష్యా నుంచి చమురు దిగుమతులు, అణు ఇంధన సహకారం లాంటి అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించే అవకాశం ఉంది.