Digvijaya Singh | శెభాష్ మోదీ అని మెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్.. తల పట్టుకున్న కాంగ్రెస్
తాను కేవలం ఆర్గనైజేషన్‌ను మెచ్చుకున్నాను తప్పితే అక్కడ ఉన్న వ్యక్తులను కాదు.. ఇప్పటికీ తాను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ని వ్యతిరేకిస్తూనే ఉంటా అంటూ ఈ వివాదంపై చెప్పుకొచ్చారు దిగ్విజయ్ సింగ్.
Digvijaya Singh | ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. ఆ పార్టీలో ఉన్న నేతలు మరో పార్టీని, మరో పార్టీ నేతలను పొగిడితే ఎలా ఉంటుంది? పర్సనల్‌గా ఎవరికీ తెలియకుండా పొగిడితే ఓకే కానీ.. పబ్లిక్‌లో అది కూడా సోషల్ మీడియాలో పొగిడితే ఇంకేమైనా ఉందా? రచ్చ రచ్చ అవుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విషయంలోనూ తాజాగా అదే జరిగింది. దిగ్విజయ్ చేసిన ఆ పనికి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దేశరాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయింది.
కొరా అనే వెబ్‌సైట్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన పాత ఫోటోను షేర్ చేస్తూ దిగ్విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోటోను నేను కొరా సైట్‌లో చూశాను. చాలా ఆకట్టుకునేలా ఉంది. ఆర్ఎస్ఎస్‌కి చెందిన క్షేత్రస్థాయి లేవల్‌లో పనిచేసే స్వయం సేవక్ , జన్ సంఘ్ కార్యకర్తలు నాయకుల కింద నేల మీద కూర్చొని ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా అయ్యారంటూ నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. ఇది కదా సంఘ్ శక్తి అంటే. జై సియా రామ్ అంటూ పోస్ట్ చేశారు.
ఒక వారం ముందే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి.. దిగ్విజయ్ సింగ్ ఓ లేఖ రాశారు. పార్టీని పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో బీజేపీ పార్టీని పొగడటంతో కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ బీజేపీ పార్టీని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టారు. తాజగా దిగ్విజయ్ సింగ్ ఆ జాబితాలో చేరడంతో అసలు కాంగ్రెస్ పార్టీ నేతల మనసులో ఏం మెదులుతోంది అని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
తాను కేవలం ఆర్గనైజేషన్‌ను మెచ్చుకున్నాను తప్పితే అక్కడ ఉన్న వ్యక్తులను కాదు.. ఇప్పటికీ తాను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ని వ్యతిరేకిస్తూనే ఉంటా అంటూ ఈ వివాదంపై చెప్పుకొచ్చారు దిగ్విజయ్ సింగ్.
Digvijay Singh openly dissents against Rahul Gandhi.
He makes it clear that under Rahul Gandhi the Congresss organization has collapsed.
Congress vs Congress on display! pic.twitter.com/meGMyHF9wc
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) December 27, 2025
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






