Nitin Nabin | జేపీ నడ్డా ప్లేస్‌లోకి నితిన్ నబిన్.. ఎవరీయన?
జనవరి 14 మకర సంక్రాంతి తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉంటాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది.
Nitin Nabin | కేంద్ర పార్టీలో బీజేపీ పలు మార్పులకు రంగం సిద్ధం చేసింది. బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకానికి హైకమాండ్ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్లేస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్‌కి చెందిన రాష్ట్ర మంత్రి నితిన్ నబిన్‌ను నియమించనున్నారు.
నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ బీజేపీ పార్టీలో ఇంతకుముందు లేదు. 2019 నుంచి ఈ పోస్ట్‌ను బీజేపీ తీసుకొచ్చింది. బీజేపీ చీఫ్ కావడానికి ఉన్న ఒకే ఒక్క స్టెప్ ఇదే. ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి ఆ తర్వాత నేషనల్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చేలా హైకమాండ్ ప్లాన్ చేసింది.
జూన్ 2019 లో కూడా అమిత్ షా కేంద్ర మంత్రి అయ్యాక, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నడ్డాను నియమించారు. ఒక ఆరు నెలలు ఆ పోస్టులో ఉన్న నడ్డా.. జనవరి 2020లో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రెసిడెంట్‌గా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీ ప్రెసిడెంట్‌గా ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. బీజేపీ రూల్స్ ప్రకారం ఒక నేత మూడేళ్లకు ఒక టర్మ్‌గా రెండు టర్మ్‌లు మాత్రమే పార్టీ చీఫ్‌గా పని చేయగలరు. నడ్డా రెండు టర్మ్స్ పూర్తయినందున ఇప్పుడు ఆ బాధ్యతను కొత్త నేతకు అందిస్తున్నారు.
నితిన్ నబిన్ ఎందుకు?
1980 లో పాట్నాలో జన్మించిన నబిన్ తన పొలిటికల్ జర్నీని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ వింగ్ అయిన ఏబీవీపీలో యాక్టివ్‌గా విద్యార్థి దశ నుంచే పాల్గొనేవారు. తన 20 ఏళ్ల వయసులోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం నబిన్ ఐదో సారి ఎమ్మెల్యేగా పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గంలో గెలిచారు. 2025 లో బీహార్‌లో బీజేపీ గెలుపునకు నితిన్ నబిన్ ఎంతో కృషి చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థిని అయిన రేఖా కుమారీని 51 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన తర్వాత బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబిన్ పేరు వినిపించింది. 45 ఏళ్ల వయసులోనే బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతూ యుక్త వయసులోనే నితిన్ పెద్ద బాధ్యతను నిర్వర్తించనున్నారు.
ప్రధాని మోదీ అభినందనలు
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ పేరును ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. నితిన్‌కి అభినందనలు తెలిపారు. ఆయన యంగ్, కష్టపడేతత్వం ఉన్న నేత. ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన పనితీరు అద్భుతం. ప్రజల కష్టాలను తెలిసిన మనిషి. ప్రజల వైపు ఉండే నేత. నిజాయితీతో, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేసే నేతగా ఆయనకు గౌరవం ఉంది.. అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జనవరి 14 తర్వాత ప్రెసిడెంట్ ఎన్నికలు
జనవరి 14 మకర సంక్రాంతి తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నికలు ఉంటాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది.
సంబంధిత వార్తలు

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026

Parle Industries | మెలోడీ ఎఫెక్ట్.. పార్లే ఇండస్ట్రీస్ షేర్లు భారీగా ర్యాలీ..
మే 20, 2026

PM Modi Netherlands Visit | నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ పర్యటన: ప్రవాసుల సభలో ‘ఝల్ మురి’ నుంచి ఒలింపిక్స్ దాకా ఆసక్తికర ప్రసంగం
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



