త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trump Tariffs | 60 దేశాల‌పై ట్రంప్ కొత్త సుంకాలు.. భార‌త్‌పై ఎంతంటే..?

Trump Tariffs | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మ‌రోసారి టారిఫ్స్ (Tariffs) బాంబ్ పేల్చారు. వెట్టిచాకిరీ (Forced Labour) నిరోధానికి తగిన చర్యలు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మైనందుకు గానూ భార‌త్ (India) స‌హా 60 భాగ‌స్వామ్య‌ దేశాల‌పై అదనపు సుంకాలను ప్ర‌క‌టించారు.

D

International | Published On Jul 24, 2026, 10.10 am IST

Trump Tariffs | 60 దేశాల‌పై ట్రంప్ కొత్త సుంకాలు.. భార‌త్‌పై ఎంతంటే..?
Advertisement

Trump Tariffs | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మ‌రోసారి టారిఫ్స్ (Tariffs) బాంబ్ పేల్చారు. వెట్టిచాకిరీ (Forced Labour) నిరోధానికి తగిన చర్యలు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మైనందుకు గానూ భార‌త్ (India) స‌హా 60 భాగ‌స్వామ్య‌ దేశాల‌పై అదనపు సుంకాలను ప్ర‌క‌టించారు. ఆయా దేశాల‌పై 10 నుంచి 12 శాతం సుంకాలు విధిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం తాత్కాలికంగా అమల్లో ఉన్న 10% గ్లోబల్ టారిఫ్ గడువు శుక్ర‌వారం అర్ధ‌రాత్రితో ముగియ‌నుంది. ఆ వెంట‌నే కొత్త సుంకాలు అమ‌ల్లోకి వ‌స్తాయి.

వెట్టికాచిరీ నిరోధించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌న్న‌ ఆరోప‌ణ‌ల‌పై సుమారు 60 దేశాల‌పై యూఎస్ ట్రేడ్ రెప్ర‌జెంటేటివ్ (US Trade Representative) ద‌ర్యాప్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాలు 'బలవంతపు శ్రమ' (Forced Labour) ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను సమర్థవంతంగా నిషేధించడానికి లేదా నిరోధించడానికి త‌గిన‌ చర్యలు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని గుర్తించింది. ఈ మేర‌కు తొలుత‌ భార‌త్ స‌హా ఆయా దేశాల‌పై 12.5 శాతం అద‌న‌పు సుంకాల‌ను ప్ర‌తిపాదించింది. అయితే, వెట్టికాకిరీ నిరోధ‌క చ‌ట్టాల అమ‌లును భార‌త్ వేగ‌వంతం చేసిన నేప‌థ్యంలో ట్రంప్ యంత్రాంగం ఈ టారిఫ్స్ నుంచి న్యూఢిల్లీకి కాస్త ఊర‌ట క‌ల్పించింది. సుంకాల‌ను 10 శాతానికి త‌గ్గించింది.

ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం భార‌త్ స‌హా అర్జెంటీనా, బంగ్లాదేశ్‌, బ్రిట‌న్‌, కెన‌డా, ఇండేనేషియా, మ‌లేషియా, మెక్సికో, పాకిస్థాన్‌, శ్రీ‌లంక స‌హా 18 దేశాలు 10 శాతం సుంకాన్ని ఎదుర్కోనున్నాయి. యూరోపియ‌న్ యూనియ‌న్‌, జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, తైవాన్‌, స్విట్జ‌ర్లాండ్ దేశాలు 10%-12.5% సుంకాల‌ను ఎదుర్కోనున్నాయి. చైనా స‌హా మిగిలిన 38 దేశాల‌పై సుంకాలు 12.5% వ‌ర్తించ‌నున్నాయి.

Advertisement
Advertisement