త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. తెర‌పైకి ప్రత్యేక బ్యూరో

Special Traffic Bureau | హైద‌రాబాద్ జంట‌న‌గ‌రాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ, రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణ సమయం, తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్య కేవలం నిబంధనల అమలుతో పరిష్కారం కాదని, ప్రజల ప్రయాణ అవసరాలు, రద్దీ పరిస్థితులను అర్థం చేసుకుని శాస్త్రీయ విధానంలో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jul 24, 2026, 8.23 pm IST

Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. తెర‌పైకి ప్రత్యేక బ్యూరో
Advertisement
  • రద్దీకి శాశ్వత పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి
  • సిగ్నల్‌ ఫ్రీ సిటీ లక్ష్యం, ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు

Special Traffic Bureau | హైద‌రాబాద్ జంట‌న‌గ‌రాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ, రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణ సమయం, తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్య కేవలం నిబంధనల అమలుతో పరిష్కారం కాదని, ప్రజల ప్రయాణ అవసరాలు, రద్దీ పరిస్థితులను అర్థం చేసుకుని శాస్త్రీయ విధానంలో క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటుకు ముందు పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని సూచించారు.

నగరాల్లో ట్రాఫిక్‌ పరిస్థితులపై ప్రతి రెండు నెల‌లు, లేదంటే మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించి, అవసరమైన మార్పులు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రధాన మార్గాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర సేవల వాహనాలు ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీ సమయాలు, ప్రజల పనివేళలు, వాతావరణ పరిస్థితులు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్‌ ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. కొత్తగా రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు నిర్మించే ముందు ట్రాఫిక్‌ అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. భవిష్యత్‌లో పెరిగే వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఓఆర్‌ఆర్‌పై వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేయకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను సిగ్నల్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా నిరంతర రాకపోకలు సాగేలా ట్రాఫిక్‌ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ట్రాఫిక్‌ నిర్వహణలో ఆధునిక విధానాలను అమలు చేయాలని సీఎం అధికారులకు తెలిపారు. ప్రత్యేక బ్యూరో ఏర్పాటుతో ట్రాఫిక్‌ సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement