త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Sanjay Jaju | నెల‌రోజుల్లో విద్యార్థుల‌కు కొత్త యూనిఫారాలు

CS Sanjay Jaju | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఎదురుచూపులకు తెరపడనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫారాలను నెల రోజుల్లోగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

P

Telangana | Published On Jul 24, 2026, 8.47 pm IST

CS Sanjay Jaju | నెల‌రోజుల్లో విద్యార్థుల‌కు కొత్త యూనిఫారాలు
Advertisement
  • 26 వేల మహిళా సంఘాలకు కుట్టు పనితో ఉపాధి
  • సీఎస్‌ సంజయ్‌ జాజు
  • వర్షాభావంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు దిశానిర్దేశం

CS Sanjay Jaju | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఎదురుచూపులకు తెరపడనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫారాలను నెల రోజుల్లోగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. యూనిఫారాల తయారీ బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించడం ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు యూనిఫారాల తయారీ, పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు శుక్రవారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యార్థులకు సకాలంలో యూనిఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు..

యూనిఫారాల కుట్టు పనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించినట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు. దీంతో విద్యార్థులకు అవసరమైన దుస్తులు అందడంతో పాటు మహిళా సంఘాలకు అదనపు ఉపాధి లభించనుంది. విద్యార్థులకు అందించే యూనిఫారాలు, షూస్‌, ఇతర స్కూల్‌ కిట్ల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీఎస్‌ స్పష్టం చేశారు. కేవలం సరఫరా పూర్తయిందా లేదా అనే దానికే పరిమితం కాకుండా, విద్యార్థుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి నాణ్యతను నిర్ధారించాలని ముఖ్యమంత్రి సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. యూనిఫారాల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు.

వర్షాభావం వేళ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

మరోవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు రైతులను అప్రమత్తం చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఇప్పటివరకు 27 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, 385 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని సీఎస్‌ సూచించారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో ప్రధాన రిజర్వాయర్లలోని నీటిని తాగునీటి అవసరాలకు రిజర్వ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని..

వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఇతర పంటలను ప్రోత్సహించాలని సూచించారు. వాటికి కనీస మద్దతు ధర (MSP) లభిస్తున్న విషయాన్ని రైతులకు వివరించి, పంటల మార్పిడిపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుత సీజన్‌లో ఫామ్‌ పాండ్ల నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని, ప్రతి 45 రోజులకు ఒకసారి మండల స్థాయి సమావేశాలు నిర్వహించి పరిస్థితులను సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్‌ సీఎస్‌లు సవ్యసాచి ఘోష్‌, దాన కిశోర్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, డైరెక్టర్‌ గోపీ, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ దివ్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement