త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Iran Tensions | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఇరాన్‌..!

US-Iran Tensions | అమెరికా నౌకాద‌ళాన్ని ఇరాన్‌కు పంపింది. దాంతో ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌స్థాయికి పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ఇరాన్ సైతం హార్ముల్ జ‌ల‌సంధిలో రెండురోజుల పాటు నౌకాద‌ళ విన్యాసాల‌ను ప్ర‌క‌టించింది. అయితే, యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ ఇరాన్ సైన్యానికి హెచ్చ‌రిక‌లు చేసింది.

P

International | Published On Jan 31, 2026, 4.07 pm IST

US-Iran Tensions | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఇరాన్‌..!
Advertisement

US-Iran Tensions | అమెరికా నౌకాద‌ళాన్ని ఇరాన్‌కు పంపింది. దాంతో ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌స్థాయికి పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ఇరాన్ సైతం హార్ముజ్ జ‌ల‌సంధిలో రెండురోజుల పాటు నౌకాద‌ళ విన్యాసాల‌ను ప్ర‌క‌టించింది. అయితే, యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ ఇరాన్ సైన్యానికి హెచ్చ‌రిక‌లు చేసింది. ఇరాన్ స్పీడ్‌బోట్‌లు యూఎస్ నౌకలను ఢీకొట్టడానికి ప్రయత్నించడంతో సహా యూఎస్ యుద్ధ నౌకల ద‌గ్గ‌ర‌లో విన్యాసాల‌ను స‌హించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి త‌మ దేశం న్యాయ‌మైన‌, స‌మాన‌మైన చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. కానీ, ట్రంప్ డిమాండ్ల‌ను తిర‌స్క‌రించారు. రక్షణ వ్యూహాలు, క్షిపణి వ్యవస్థలు ఎప్పటికీ చర్చల అంశం కాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా సైనిక సామ‌ర్థ్యాల‌ను బ‌లోపేతం చేసుకున్న‌ట్లు ఇరాన్ స్ప‌ష్టం చేసింది. ఆర్మీ చీఫ్ అమీర్ హతామి ఒక సైనిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వివాదం ఇరాన్ సైన్యానికి, బలాలు, బలహీనతలను అర్థం చేసుకోవడానికి.. శత్రువు వ్యూహాన్ని బాగా అంచనా వేయడానికి అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు. యుద్ధం త‌ర్వాత ఇరాన్ మిస్సైల్ సిస్ట‌మ్‌, వైమానిక ర‌క్ష‌ణ‌, మొత్తం సైనిక సామ‌ర్థ్యాలు గ‌తంలో కంటే మెరుగైన‌, బ‌ల‌మైన స్థితిలో ఉన్నాయ‌న్నారు. భవిష్యత్తులో జరిగే ఏదైనా దాడిని ఎదుర్కొనేందుకు స‌న్నాహాల‌ను బ‌లోపేతం చేసిన ఇరాన్‌కు ఇది స్పెష‌ల్ అనుభ‌వమ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు.

హార్ముజ్ జ‌ల‌సంధిలో ఇరాన్ త్వ‌ర‌లో విన్యాసాలు చేసేందుకు నేవీ ఏర్పాట్లు చేస్తున్న‌ది. ఈ ఇరుకైన జ‌ల‌సంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో క‌లుప‌నున్న‌ది. ఇది ప్రపంచంలోని అత్యంత కీల‌క‌మైన సముద్ర మార్గాల్లో ఒక‌టి. ప్రపంచవ్యాప్తంగా ఈ జలసంధి ద్వారా పెద్ద మొత్తంలో చమురు, వాయువు స‌ర‌ఫ‌రా అవుతోంది. ఇరాన్, ఒమన్ ప్రాదేశిక జలాల్లో ఉన్నప్పటికీ.. ఇది అంతర్జాతీయ జలమార్గంగా ప‌రిగ‌ణిస్తారు. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. ఈ మార్గం గుండా వెళ్లే చ‌మురు, గ్యాస్‌కి ప్ర‌త్యామ్నాయం లేదు. ఇక్క‌డి నుంచి ఎక్కువ భాగం ఆసియా దేశాల‌కు స‌ర‌ఫ‌రా అవుతోంది. గ‌త సంవ‌త్స‌రం జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన స‌మ‌యంలో ఈ మార్గంలో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. ప్ర‌పంచ ఇంధ‌న ధ‌ర‌ల‌పై ప్ర‌భావితం చేసింది.

ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి, సుప్రీం లీడర్ సలహాదారు అలీ షంఖానీ మాట్లాడుతూ.. శ‌త్రువుల చ‌ర్య‌ల‌కు ధీటుగా, స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌తిస్పందిస్తామ‌న్నారు. ఇరాన్ తనను తాను సముద్రానికే పరిమితం చేసుకోదని, కానీ సమగ్రమైన, సైనిక చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌లో అమెరికా సైనిక ఉనికి పెరిగినంత మాత్రాన అక్కడ అమెరికాకు పైచేయి లభించినట్లు కాదని షమ్ఖానీ వ్యాఖ్యానించారు. ఇది త‌మ ప్రాంతం, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, బలం ఇత‌రుల కంటే త‌మ‌కే బాగా తెలుస‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement