US-Iran Row | ఏ దాడినైనా పూర్తి యుద్ధంగానే చూస్తాం.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
US-Iran Row | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. టెహ్రాన్‌పై ఎలాంటి దాడి జరిగినా.. దాన్ని పూర్తిస్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో బలంగా ప్రతిస్పందన ఉంటుందని తేల్చి చెప్పింది.
International | Published On Jan 24, 2026, 10.00 am IST
US-Iran Row | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. టెహ్రాన్‌పై ఎలాంటి దాడి జరిగినా.. దాన్ని పూర్తిస్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో బలంగా ప్రతిస్పందన ఉంటుందని తేల్చి చెప్పింది. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మధ్యప్రాశ్చ దేశానికి అమెరికా భారీగా యుద్ధ నౌకలు పంపుతున్నట్లుగా ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. ఓ సీనియర్ అధికారి రాయిటర్స్ సంస్థతో మాట్లాడుతూ అయతుల్లా అలీ ఖమేని నేతృత్వంలోని ప్రభుత్వం యూఎస్ నుంచి వస్తున్న సైనిక బెదిరింపులకు సాధ్యమైన అన్ని మార్గాల ద్వారా ప్రతిస్పందిస్తుందని చెప్పారు. పరిమితంగా, విస్తృత దాడులు జరిగినా ఆ దాడిని ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధంగా పరిగణిస్తుందని ఆ అధికారి స్పష్టం చేశారు. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్, టోమాహాక్ మిస్సైల్స్‌తో కూడిన మూడు డిస్ట్రాయర్లను ఇరాన్ వైపుగా పంపుతోంది. అలాగే, వైమానిక దళం డజను ఎఫ్-15 యుద్ధ విమానాలు ఈ ప్రాంతంలో మోహరించింది.
ఇంతకు ముందు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరికలు చేస్తూ.. ఇరాన్‌పై అమెరికా నిఘా వేసి ఉంచిందని తెలిపారు. యుద్ధ నౌకలు గల్ఫ్ ప్రాంతం వైపు వెళుతోందని ఆయన తెలిపారు. మీరు ఉరిశిక్షలు అమలు చేస్తే..గతంలో కంటే చాలా బలమైన శక్తితో ఇరాన్‌పై దాడి చేస్తామని ఖమేని సర్కారును హెచ్చరించారు. అణు కార్యక్రమంపై జరిగిన దాడి చాలా చిన్నదిగా కనిపిస్తుందన్నారు. అమెరికా ఒత్తిడికి ఇరాన్ సహనం కోల్పోతుందా? అంటే టెహ్రాన్ అప్రమత్తంగా ఉందని ఆ అధికారి తెలిపారు. ఏ క్లిష్ట పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఇరాన్ సైనిక దళాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అమెరికా సైనిక ఒత్తిడికి నిరంతరం గురవుతున్న దేశానికి, దాడికి ప్రతిస్పందించడానికి తమ వద్ద ఉన్న ప్రతి వనరును ఉపయోగించడం తప్ప మరో మార్గం లేదన్నారు.
ఇదిలా ఉడగా.. ఇరాన్‌లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 5వేల మందికిపైగా మరణించినట్లుగా మానవ హక్కుల సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర దర్యాప్తును విస్తరించాలని, నిరసనకారులపై అధికారులు చేపట్టిన హింసాత్మక అణచివేతపై తక్షణ విచారణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. క్యూబా, పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. 1979 తర్వాత జరిగిన అతిపెద్ద అణచివేత చర్యగా భావిస్తున్నారు. ట్రంప్ ఇటీవల దావోస్‌లో పర్యటించి అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






