US Iran Peace Deal | అమెరికా-ఇరాన్ మధ్య ముగియనున్న యుద్ధం? ఢిల్లీ వేదికగా మార్కో రూబియో భారీ హింట్
మూడు నెలల అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు పడనుందా? భారత్ పర్యటనలో ఉన్న మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి.
International | Published On May 24, 2026, 4.35 pm IST
US Iran Peace Deal | త్రినేత్ర.న్యూస్ : గత మూడు నెలలుగా భీకరంగా సాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియనుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి (US Secretary of State) మార్కో రూబియో ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, రాబోయే కొన్ని గంటల్లోనే ప్రపంచానికి ఒక "గుడ్ న్యూస్" అందే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో కలిసి దాదాపు 53 నిమిషాల పాటు జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మార్కో రూబియో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌తో కుదుర్చుకుంటున్న ఈ పీస్ డీల్ (Peace Deal) వల్ల హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వివాదానికి కూడా చెక్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మా టార్గెట్ అదే
"ఇరాన్ ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్ (అణ్వాయుధం) కలిగి ఉండకూడదు.. అదే మా అంతిమ లక్ష్యం" అని రూబియో స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారంగా ఇరాన్.. హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రూబియో, "అదొక అంతర్జాతీయ జలమార్గం. దానిగుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం, నాశనం చేస్తామని బెదిరించడం ఇంటర్నేషనల్ లా ప్రకారం పూర్తిగా చట్టవిరుద్ధం" అని ఫైర్ అయ్యారు.
చర్చలు సక్సెస్.. ట్రంప్ ఏమన్నారంటే?
ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' (Truth Social) ప్లాట్‌ఫామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్, టర్కీ, బహ్రెయిన్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల అధినేతలు.. అలాగే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. అందరితో చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని, ఇరాన్‌తో పీస్ డీల్ దాదాపు పూర్తయిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని కూడా రీ-ఓపెన్ చేస్తారని ట్రంప్ తెలిపారు.

ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్
అమెరికా ప్రకటనల నేపథ్యంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) స్పందించింది. ట్రంప్ చేస్తున్నది కేవలం 'ప్రాపగాండా' (Propaganda) అని కొట్టిపారేసింది. అణు కార్యక్రమం (Nuclear Programme)పై తాము అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, అసలు ఆ టాపిక్ పై ఇంకా చర్చలే జరగలేదని ఫార్స్ (Fars) న్యూస్ ఏజెన్సీకి తెలిపింది. అంతేకాదు, హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని, యుద్ధానికి ముందు ఉన్నట్లుగా నౌకల రాకపోకలకు 'ఫ్రీ ప్యాసేజ్' ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ వర్గాలు తేల్చిచెప్పాయి.
మొత్తానికి అమెరికా గుడ్ న్యూస్ వస్తుందని చెబుతున్నా.. ఇరాన్ రియాక్షన్ చూస్తుంటే ఈ పీస్ డీల్ వెనుక ఇంకా చాలా ట్విస్టులు ఉన్నట్లు అర్థమవుతోంది.
Addressing the media alongside US @SecRubio.
🇮🇳 🇺🇸 https://t.co/Qg2qZY5qBj
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 24, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Strait of Hormuz Reopen | ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం: 30 రోజుల్లో హార్ముజ్ జలసంధి ఓపెన్.. చమురు ధరలకు బ్రేక్
మే 24, 2026

US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
మే 23, 2026

US Iran Peace Memo | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు? ‘వన్-పేజీ’ ఒప్పందంతో శాంతి చర్చలకు మార్గం
మే 6, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



