Epstein Files | ఎప్‌స్టీన్ ఫైల్స్ నుంచి ట్రంప్ ఫోటో మాయం.. 16 కీలక పత్రాలను తొలగించిన యూఎస్ సర్కార్
ఓవైపు ఇంకా చాలా ఫైల్స్, ఫోటోలు పబ్లిక్‌లో అప్ లోడ్ అవుతాయని చెబుతున్నా, కీలక సమాచారం గోప్యంగా ఉంచడం వల్ల ఫైల్స్ బహిర్గతంపై పారదర్శకత లోపించిందనే వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతోంది.
International | Published On Dec 21, 2025, 10.26 am IST
Epstein Files | అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో మరో అప్‌డేట్ వచ్చింది. ఆ ఫైల్స్ నుంచి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న ఫోటో మాయం అయింది. దానితో పాటు కీలక పత్రాలుగా భావిస్తున్న 16 ఫైల్స్ కూడా మిస్ అయ్యాయి. జస్టిస్ డిపార్ట్‌మెంట్(DOJ) పబ్లిక్ వెబ్‌సైట్‌లో ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ ఉన్న ఫోటోలతో పాలు పలు డాక్యుమెంట్లను అప్ లోడ్ చేశారు. వాటిని అప్ లోడ్ చేసిన 24 గంటల్లోపే కొన్ని ఫోటోలు, డాక్యుమెంట్లను యూఎస్ సర్కారు తొలగించింది.
ప్రభుత్వం దేనిని దాచడానికి ప్రయత్నిస్తోంది?
డీవోజే వెబ్ సైట్ నుంచి తొలగించిన పలు కీలక డాక్యుమెంట్లలో ఎప్‌స్టీన్ నివాసానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. వాటిలో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్, గిస్లైన్ మాక్స్‌వెల్ ఉన్నారు. ఆ ఫోటోను ముందు అప్ లోడ్ చేసి ఆ తర్వాత వెబ్ సైట్ నుంచి తీసేశారు. దానితో పాటు పలు కీలక డాక్యుమెంట్లను తొలగించడంపై యూఎస్ ప్రజలు మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం ప్రజల నుంచి ఏం దాచడానికి ప్రయత్నిస్తోంది? ప్రజలకు పారదర్శకత వద్దా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
అసలు పత్రాలు ఏవి?
ప్రభుత్వం వేల పేజీలను బహిర్గతం చేసింది కానీ.. అందులో ఎప్‌స్టీన్ నేరాలకు సంబంధించిన వివరాలు, ఆయనకు శిక్ష పడకుండా కాపాడిన అధికారులు వివరాలు మాత్రం లేవు. ఎఫ్‌బీఐ చేసిన కీలక విచారణ పత్రాలు ఎక్కడ? బాధితుల స్టేట్‌మెంట్స్ ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోందది. ఎప్‌స్టీన్ బాధితులు కూడా ఈ ఫైల్స్ బహిర్గతంపై మండిపడుతున్నారు. న్యాయ వ్యవస్థ కావాలనే మమ్మల్ని ఇంకా మోసం చేస్తోందని బాధితుల్లో ఒకరు తెలిపారు.
ఓవైపు ఇంకా చాలా ఫైల్స్, ఫోటోలు పబ్లిక్‌లో అప్ లోడ్ అవుతాయని చెబుతున్నా, కీలక సమాచారం గోప్యంగా ఉంచడం వల్ల ఫైల్స్ బహిర్గతంపై పారదర్శకత లోపించిందనే వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






