త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Iran Conflict | మాట విన్నారా స‌రే.. లేక‌పోతే ఖ‌ర్గ్‌ను ధ్వంసం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌..!|

US-Iran Conflict | ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ప్ర‌భుత్వంతో అమెరికా చ‌ర్య‌లు జ‌రుపుతోంద‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఈ దిశ‌లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిని సాధించామ‌న్నారు. ఏ కార‌ణంతోనైనా త్వ‌ర‌లో ఒప్పందం కుద‌ర‌క‌పోతే, హార్మూజ్ జ‌ల‌సంధిని తెరువ‌క‌పోయినా ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ ప్లాంట్ల‌ను, చ‌మురు బావుల‌ను, ఖ‌ర్గ్ ద్వీపాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

P

International | Published On Mar 30, 2026, 7.02 pm IST

US-Iran Conflict | మాట విన్నారా స‌రే.. లేక‌పోతే ఖ‌ర్గ్‌ను ధ్వంసం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌..!|
Advertisement

US-Iran Conflict | ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ప్ర‌భుత్వంతో అమెరికా చ‌ర్య‌లు జ‌రుపుతోంద‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఈ దిశ‌లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిని సాధించామ‌న్నారు. ఏ కార‌ణంతోనైనా త్వ‌ర‌లో ఒప్పందం కుద‌ర‌క‌పోతే, హార్మూజ్ జ‌ల‌సంధిని తెరువ‌క‌పోయినా ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ ప్లాంట్ల‌ను, చ‌మురు బావుల‌ను, ఖ‌ర్గ్ ద్వీపాన్ని సైతం పూర్తిగా ధ్వంసం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. గ‌త ప్ర‌భుత్వం 47 ఏళ్ల భ‌యంక‌ర‌మైన పాల‌న‌లో ఇరాన్ క్రూరంగా చంపిన లెక్క‌లేనంత మంది సైనికుల‌కు, ఇత‌రుల‌కు ప్ర‌తీకార‌మ‌వుతుందంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

ఇదిలా ఉండ‌గా.. అంత‌కు ముందు అమెరికా యుద్ధ విమానాల‌కు గ‌గ‌న‌త‌లాన్ని మూసివేస్తున్న‌ట్లుగా స్పెయిన్ ప్ర‌క‌టించింది. ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించిన ఏ చ‌ర్య‌కైనా సైనిక స్థావ‌రాలు గానీ, గ‌గ‌న‌త‌లాన్ని గానీ ఉప‌యోగించుకునేందుకు అనుమ‌తించ‌బోమ‌ని స్పెయిన్ ర‌క్ష‌ణ మంత్రి మార్గ‌రీట రోబ్లెస్ స్ప‌ష్టం చేశారు. సైనిక వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ స్పెయిన్ వార్త ప‌త్రిక ఎల్ పైస్ నివేదించింది. ఈ నివేదిక ప్ర‌కారం ప‌శ్చిమాసియాకు చేరుకునే సైనిక విమానాలు నాటో స‌భ్య‌దేశ‌మైన స్పెయిన్ మీదుగా వెళ్ల‌కుండా ప్ర‌త్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాల్సి వ‌స్తుంది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు. అంత‌కుముందు ఆదివారం క్యూబాపై దాడి చేస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు చ‌ర్చ‌ల కోసం ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధ‌మేన‌ని పాక్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఇరాన్ స్పందించింది. పాక్ నేతృత్వంలో జరిపే సంధి ప్రయత్నాల్లో త‌మ ప్ర‌మేయం లేద‌ని ఆ దేశం స్ప‌ష్టం చేసింది. పాక్ రాజీ ప్ర‌య‌త్నాల‌కు నో చెబుతూ ముంబ‌యిలోని ఇరాన్ రాయ‌బార కార్యాల‌యం ఈ మేర‌కు ట్వీట్ చేసింది. అమెరికాతో ప్ర‌త్య‌క్ష చ‌ర్చ‌లు జ‌రుగ‌లేద‌ని, కేవ‌లం మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే వచ్చాయని తెలిపింది. చ‌ర్చ‌లు వారి సొంత వ్య‌వ‌హార‌మ‌ని, యూఎస్ దౌత్యం ఎప్ప‌టిక‌ప్పుడు మారుతోంద‌ని, మాట‌లు మారుస్తుంద‌ని ఆరోపించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement