Stock Markets | స్టాక్ మార్కెట్లలో కల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు..
Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతుందనే ఆందోళనలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో భారీ విక్రయాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా భారీ నష్టాలలో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు ఆందోళన చెందుతూ భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతుందనే ఆందోళనలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో భారీ విక్రయాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా భారీ నష్టాలలో కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు ఆందోళన చెందుతూ భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇక సెన్సెక్స్ 869 పాయింట్లు (1.16 శాతం) పతనం అయి 75,156 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 315 పాయింట్లు (1.34 శాతం) నష్టపోయి 23,325 వద్ద కొనసాగుతోంది. విస్తృత మార్కెట్ సూచీలు నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ కూడా సుమారు 1 శాతం మేర పతనం అయి ట్రేడ్ అవుతున్నాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్, బ్యాంక్, ఆటో, ఐటీ రంగాలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు సైతం..
ఇక ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్ గత రాత్రి భారీ నష్టాలతో ముగిసింది. ఆసియాలో ఎంఎస్‌సీఐ ఆసియా-పసిఫిక్ షేర్ల విస్తృత సూచీ 0.5 శాతం తగ్గింది. ఈ వారం మొత్తం మీద అది 1.5 శాతం పతన దిశగా సాగుతోంది. జపాన్ నిక్కీ సూచీ 1.3 శాతం పడిపోయింది. టెక్నాలజీ కంపెనీలు అధికంగా ఉన్న దక్షిణ కొరియా మార్కెట్ దాదాపు 2 శాతం తగ్గింది. తైవాన్ ఈక్విటీలు కూడా 1 శాతం క్షీణించాయి.
మొజ్తబా హెచ్చరికలతో..
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తాజాగా తన తొలి ప్రకటనలో యుద్ధాన్ని కొనసాగిస్తామని హెచ్చరించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అలాగే అమెరికా, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు హోర్ముజ్ జలసంధిని వినియోగిస్తామని ఆయన ప్రకటించారు. చమురు, సహజ వాయువు రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం ప్రస్తుతం నౌకా రాకపోకల్లో భారీ అంతరాయాలతో దాదాపు మూసివేయబడిన పరిస్థితి ఏర్పడింది. కాగా అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గుదలతో ట్రేడవుతున్నాయి. అమెరికా ట్రెజరీ శాఖ సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అన్ని దేశాలకు 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. మార్చి 5 నాటికి నౌకల్లో లోడ్ చేసిన రష్యా చమురును భారత్ కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో ప్రపంచ సరఫరా సమస్యలకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
స్వల్పంగా తగ్గిన చమురు ధర..
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 97.635 డాలర్ల వద్ద ట్రేడవుతూ 0.96 శాతం తగ్గింది. మరోవైపు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 1.31 శాతం పడిపోయి బ్యారెల్‌కు 93.585 డాలర్లకు చేరింది. అయితే పశ్చిమ ఆసియాలో యుద్ధం మరింత కాలం కొనసాగవచ్చనే ఆందోళనతోపాటు, హోర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయబడే ప్రమాదం ఉన్నందున చమురు ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్
- ●Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్

Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..






