Stock Markets | భారీగా పతమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టం..
Stock Markets | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం హోలీ అనంతరం బుధవారం మళ్లీ ఓపెన్ కాగా ఆరంభంలోనే గ్యాప్ డౌన్‌తో సెషన్‌ను కొనసాగించాయి.
Stock Markets | పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం హోలీ సెలవు అనంతరం బుధవారం మళ్లీ ఓపెన్ కాగా ఆరంభంలోనే గ్యాప్ డౌన్‌తో సెషన్‌ను కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టపోయి 78,663 వద్ద ప్రారంభం అయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 500 పాయింట్లకు పైగా పతనం అయి 24,366 వద్ద ప్రారంభం అయింది. మరోవైపు రూపాయి విలువ కూడా గణనీయంగా పడిపోయింది. ప్రారంభంలోనే 55 పైసలు నష్టపోయి డాలర్‌తో మారకం విలువ 92.02కు చేరుకుని వారాంతపు కనిష్ట స్థాయిని తాకింది.
ఆసియాలో దక్షిణ కొరియా కోస్పి సూచీ 7.24 శాతం పతనం అవగా గత 19 నెలల కాలంలో ఇదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. జపాన్ నిక్కీ (225) 2.91 శాతం మేర పతనం అయి 54,643.28ని తాకింది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ/ఏఎస్ఎక్స్ 200 కూడా 1.71 శాతం నష్టపోయి 8,921.70ని తాకింది.
బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో పలు ఐటీ స్టాక్‌లలో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఇన్ఫోసిస్, ఎంఫసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, విప్రో, ఒరాకిల్, కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్ గరిష్టంగా 1.47 శాతం మేర లాభపడింది. విప్రో గరిష్టంగా 1.75 శాతం మేర నష్టపోయింది. నిఫ్టీ50లోని అన్ని రంగాలపై యుద్ధం ప్రభావం పడింది. అయితే నిఫ్టీ ఐటీ సూచీలో మాత్రం కొన్ని షేర్లు లాభపడడంతో ఆ రంగం ఓవరాల్‌గా పాజిటివ్‌గానే నిలిచింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి






