SIR | ఇంటి పేరుతో ఎన్యుమరేషన్ ఫారం.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌కి SIR నోటీసులు
SIR | తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు (TPCC) మహేశ్ కుమార్ గౌడ్‌కు (Mahesh Goud) ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 8న విచారణకు రావాలని బీఎల్ఓ పేర్కొన్నారు.
SIR | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు (TPCC) మహేశ్ కుమార్ గౌడ్‌కు (Mahesh Goud) ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 8న విచారణకు రావాలని బీఎల్ఓ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లిగడీ ప్రాంతంలో పోలింగ్ బూత్ నంబర్ 168లో బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ పేరుతో ఎన్యుమరేషన్ ఫారం (Enumeration Form) పూర్తి చేశారు. అయితే 2002 ఓటరు జాబితాలో ఆయన పేరు బీ. మహేశ్ కుమార్ గౌడ్ అని ఉంది. దీంతో అధికారులు దానినే పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో బీఎ అయితే బొమ్మ అయితే బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరుతో ఉన్న ధ్రువీకరణ పత్రాలను ఆయన గురువారమే అధికారులకు సమర్పించారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా 92.87 లక్షల మంది ఓటర్లకు బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఈ ఎస్‌ఐఆర్ (SIR) నోటీసులు అందజేస్తున్నారు. ఇందులో నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు, అందులో పేర్కొన్న తేదీ, సమయానికి తమ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులు, అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత ఈఆర్వో (ERO) లేదా ఏఈఆర్వో (AERO) కార్యాలయంలో వ్యక్తిగత విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.
కాగా, సర్ నోటీసులు కేవలం 48 గంటల ముందే ఇస్తున్నారని, వ్యక్తిగతంగా హాజరుకావాలనే నిబంధన వల్ల పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరిగే ప్రమాదం ఉందని టీపీసీసీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కనీసం 7 రోజుల సమయం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) ని కలిసి విజ్ఞప్తి చేసింది. అయితే నోటీసు వచ్చినంత మాత్రాన ఓటు తొలగిపోదని, వివరాల సరిచూడటానికే ఈ ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ తప్పుడు పత్రాలు సమర్పిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Accident in America | అమెరికాలో చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
ఆగస్టు 26, 2026

Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..
ఆగస్టు 25, 2026

Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!
- ●కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు
- ●Horoscope | ఆగస్టు 28 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఖర్చులు అధికం!
- ●Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- ●CM Revanth Reddy | అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●TGSRTC | రాఖీ పండుగకు 5,000 ఆర్టీసీ బస్సులు..

Raksha Bandhan | అనుబంధాల పండుగ.. రక్షాబంధన్..! రాఖీ వెనుక.. ఎన్నో కథలు..!

కాంగ్రెస్ డిసిప్లిన్ చక్రం: మంత్రులపై చర్యలు ఎలా తీసుకుంటారు? కొండా సురేఖ ఎపిసోడ్‌తో పూర్తి వివరాలు

Horoscope | ఆగస్టు 28 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఖర్చులు అధికం!

Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం



