త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TDF Canada | కెన‌డా తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక‌

TDF Canada | కెన‌డా (Canada)లో స్థిర‌ప‌డిన తెలంగాణ వాసుల ప్ర‌త్యేక సంస్థ తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోర‌మ్ (టీడీఎఫ్ - కెన‌డా) (TDF Canada) నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నికైంది. ఈ కార్య‌వ‌ర్గం రానున్న రెండేళ్ల పాటు ప‌ద‌వుల్లో ఉండ‌నుంది. టీడీఎఫ్ - కెన‌డా నూత‌న అధ్య‌క్షుడిగా జితేంద‌ర్‌రెడ్డి గార్ల‌పాటి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వెంక‌ట్ రెడ్డి పోలు ఎన్నిక‌య్యారు.

A

International | Published On Dec 30, 2025, 8.04 pm IST

TDF Canada | కెన‌డా తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక‌
Advertisement

TDF Canada | కెన‌డా (Canada)లో స్థిర‌ప‌డిన తెలంగాణ వాసుల ప్ర‌త్యేక సంస్థ తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోర‌మ్ (టీడీఎఫ్ - కెన‌డా) (TDF Canada) నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నికైంది. ఈ కార్య‌వ‌ర్గం రానున్న రెండేళ్ల పాటు ప‌ద‌వుల్లో ఉండ‌నుంది. టీడీఎఫ్ - కెన‌డా నూత‌న అధ్య‌క్షుడిగా జితేంద‌ర్‌రెడ్డి గార్ల‌పాటి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వెంక‌ట్ రెడ్డి పోలు ఎన్నిక‌య్యారు. వారితో పాటు ఫౌండేష‌న్ క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా అమిత పినికేశి, ఉపాధ్య‌క్షుడిగా మ‌హేంద‌ర్ కీస్రా, సంయుక్త కార్య‌ద‌ర్శిగా అనికేత్‌రెడ్డి శామీర్‌పేట‌, కోశాధికారిగా కృష్ణారెడ్డి చాడ‌, సంయుక్త కోశాధికారిగా ర‌వీంద‌ర్‌రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్ర‌స్టీస్ చైర్మ‌న్‌గా అర్ష‌ద్ ఘోరి, బిజినెస్ కౌన్సిల్ చైర్ ప‌ర్స‌న్‌గా ఇందురెడ్డి, స్పోర్ట్స్ క్ల‌బ్ చైర్మెన్‌గా కె. మ‌హేంద‌ర్‌రెడ్డి ఎన్నిక‌య్యారు.

కెన‌డాలో స్థిర‌ప‌డిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెన‌డా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంతో పాటు రాష్ట్రం ఏర్పాట‌య్యాక కూడా ఈ సంస్థ క్రియాశీల‌కంగా ప‌నిచేస్తోంది. ప్ర‌తీ ఏటా తెలంగాణ నైట్‌ను నిర్వ‌హిస్తూ అక్క‌డి తెలుగువారిని ఏకం చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బ‌తుక‌మ్మ పండుగ‌తో పాటు వివిధ కార్య‌క్ర‌మాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తున్నారు. కెన‌డాలో స్థిర‌ప‌డిన వంద‌లాది తెలుగువారు త‌మ కుటుంబాల‌తో ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం ద్వారా త‌మ పిల్ల‌ల‌కు తెలంగాణ సంస్కృతీ, సంప్ర‌దాయాల‌ను తెలిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యాల్లో స‌మాజ సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా ఈ సంస్థ విస్తృతంగా నిర్వ‌హిస్తోంది. ఈ సంస్థ ద్వారా ఏర్పాటైన క్రికెట్ క్ల‌బ్‌లో వంద‌లాది మంది తెలుగు విద్యార్థులు భాగ‌స్వాములుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న‌త విద్య కోసం కెన‌డా వెళ్లిన విద్యార్థుల‌కు సైతం ఈ సంస్థ స‌హాయ‌, స‌హ‌కారాలు అంద‌జేస్తోంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement