త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nora Fatehi | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ వేడుక‌ల్లో సంద‌డి చేయ‌నున్న డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫ‌తేహి..!

Nora Fatehi | బాలీవుడ్ డ్యాన్నింగ్ క్వీన్ నోరా ఫ‌తే మ‌రోసారి అంత‌ర్జాతీయ వేదిక‌పై సంద‌డి చేయ‌నుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు శ‌నివారం నిర్వాహ‌కులు అధికారికంగా ప్ర‌క‌టించారు.

P

Sports | Published On May 9, 2026, 4.53 pm IST

Nora Fatehi | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ వేడుక‌ల్లో సంద‌డి చేయ‌నున్న డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫ‌తేహి..!
Advertisement

Nora Fatehi | బాలీవుడ్ డ్యాన్నింగ్ క్వీన్ నోరా ఫ‌తే మ‌రోసారి అంత‌ర్జాతీయ వేదిక‌పై సంద‌డి చేయ‌నుంది. ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు శ‌నివారం నిర్వాహ‌కులు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ సారి డ్యాన్స్ మాత్ర‌మే కాకుండా నోరా పాట పాడ‌నుండ‌డం విశేషం. ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభ వేడుక‌లు జూన్ 12న కెన‌డాలోని బీఎంవో ఫీల్డ్‌లో జ‌రుగుతాయి. ఫిఫా వేడుక‌ల్లో నోరా క‌నిపించ‌డం ఇది రెండోసారి. గ‌తంలో ఖ‌తార్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ సంద‌ర్భంలోనూ బాలీవుడ్ బ్యూటీ ఫ్యాన్ ఫెస్ట్ కార్యక్రమంలో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. ఈసారి కెనడా కార్యక్రమంలో నోరాతో పాటు అలానిస్ మోరిస్పేట్, అలెస్సియా కారా, ఎలియానా, జెస్సీ రెయెజ్, మైఖేల్ బుబుల్‌, త‌దిత‌రులు పాల్గొనున్నారు. యూఎస్ వేదిక‌గా జ‌రిగే వేడుక‌ల్లో అనిట్టా, ఫ్యూచర్, కేటీ పెర్రీ, లిసా, రెమా, టైలా త‌దిత‌రులు సంద‌డి చేయ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఇటీవల విడుదలైన ‘సర్కే చునర్’ సాంగ్ వివాదంతో నోరా ఫతేహీ వార్తల్లో నిలిచింది. మహిళలను అసభ్యంగా చూపించారన్న ఆరోపణలతో జాతీయ మహిళా కమిషన్ (NCW) సమన్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. హిందీ వెర్షన్‌లో బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు సంజ‌య్ ద‌త్ సైతం క‌నిపించాడు. ఈ వ్య‌వ‌హారంలో మ‌హిళా క‌మిష‌న్ ఎదుట నోరా హాజ‌రైంది. అనంత‌రం మీడియాతో మాట్లాడింది. తాను లిఖితపూర్వక క్షమాపణ సమర్పించినట్లు తెలిపింది. ఎవరినీ అవమానించే ఉద్దేశం తమకు లేదని, త‌న బాధ్య‌త‌ను గుర్తిస్తున్నాన‌ని తెలిపింది. అనాథ బాలికల విద్య కోసం సహాయం చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. వివాదం పెరగడంతో ‘సర్కే చునర్’ సాంగ‌ర్‌ను యూట్యూబ్ నుంచి తొల‌గించారు. అయితే, సోష‌ల్ మీడియాలో మాత్రం ఇంకా సాంగ్ చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. వివాదం నేప‌థ్యంలో సింగ‌ర్‌, లిరిక్ రైట‌ర్, మూవీ ద‌ర్శ‌కుడు సైతం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగిన‌ట్ల‌య్యింది.

Advertisement
Advertisement