Singer Murdered | చిత్ర పరిశ్రమలో విషాదం.. దారుణ హత్యకు గురైన పంజాబీ సింగర్..!
Singer Murdered | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. పంజాబ్‌కు చెందిన సింగర్ యశీందర్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె రోజు రోజుల కిందట కనిపించకుండా పోగా.. శవమై కనిపించారు. ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు నిర్ధారించారు.
Entertainment | Published On May 19, 2026, 4.45 pm IST
Singer Murdered | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. పంజాబ్‌కు చెందిన సింగర్ యశీందర్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె రోజు రోజుల కిందట కనిపించకుండా పోగా.. శవమై కనిపించారు. ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని నిలో కాలువలో నుంచి వెలికితీశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం సమ్రాలా సివిల్ ఆసుపత్రి మార్చూరీకి తరలించారు. ఈ ఘటన సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.
మృతురాలి సోదరుడు జోతిందర్ సింగ్ ఫిర్యాదు మేరకు ఇందర్ కౌర్ ఈ నెల 13న సాయంత్ర సమయంలో తన ఫోర్డ్ ఫిగో కారులో ఇంట్లోకి సరుకులు తీసుకువచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లింది. చాలా సమయం గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కనిపించకుండా పోవడంతో పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే, మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా గత కొంతకాలంగా ఇందర్ కౌర్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. యశీందర్ ఆమె తిరస్కరించడంతో ఆగ్రహానికి గురైన ఆమె హత్యకు పథకం వేసినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రధాన నిందితుడు సుఖ్విందర్ సింగ్ కెనడా నుంచి ప్రత్యేకంగా పంజాబ్‌కు వచ్చి ఈ హత్యకు కుట్ర పన్నాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్తున్న సమయంలో అడ్డుకొని తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని నిలో కాలువలో పడేసినట్లుగా భావిస్తున్నారు. ఆ తర్వాత నిందితుడు తిరిగి కెనడాకు పారిపోయినట్లుగా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 15న ప్రధాన నిందితుడు సుఖ్విందర్ సింగ్‌తో పాటు అతని ఫ్రెండ్ కరంజిత్ సింగ్‌పై కేసు నమోదు చేసినప్పటికీ, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నిందితుడు దేశం విడిచి పారిపోయినట్లుగా బాధిత కుటుంబం ఆరోపించింది. కాలువలో మహిళ మృతదేహం లభించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఆధారంగా యశీందర్ కౌర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడిని విదేశాల నుంచి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు ప్రారంభించినట్లుగా జమాల్‌పూర్ ఎస్‌హెచ్‌వో బల్బీర్ సింగ్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jagga Reddy | క్యూరింగ్ కాక మేడిగడ్డ కూలిపోయింది : జగ్గారెడ్డి
- ●Jaggareddy | హరీశ్‌రావు.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోయినా పర్వాలేదా..? : జగ్గారెడ్డి
- ●OpenAI | రూ.2 కోట్ల జీతం.. ఓపెన్ఏఐలో భారీ ఉద్యోగ అవకాశం..
- ●Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
- ●Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

Jagga Reddy | క్యూరింగ్ కాక మేడిగడ్డ కూలిపోయింది : జగ్గారెడ్డి

Jaggareddy | హరీశ్‌రావు.. ఖమ్మం జిల్లా కొట్టుకుపోయినా పర్వాలేదా..? : జగ్గారెడ్డి

OpenAI | రూ.2 కోట్ల జీతం.. ఓపెన్ఏఐలో భారీ ఉద్యోగ అవకాశం..

Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి




