Hyundai Palisade | ఎస్‌యూవీ అమ్మకాల నిలిపివేత.. 68వేలకుపైగా వాహనాల రీకాల్..!
Hyundai Palisade | ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company) ఎస్‌యూవీ మోడల్ హ్యుందాయ్ పాలిసేడ్ (Hyundai Palisade)కు సంబంధించిన కొత్త వేరియంట్ల అమ్మకాలను అమెరికా, కెనడాలో తాత్కాలికంగా నిలిపివేసింది.
Hyundai Palisade | ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company) ఎస్‌యూవీ మోడల్ హ్యుందాయ్ పాలిసేడ్ (Hyundai Palisade)కు సంబంధించిన కొత్త వేరియంట్ల అమ్మకాలను అమెరికా, కెనడాలో తాత్కాలికంగా నిలిపివేసింది. 2026 మోడల్ సంవత్సరానికి చెందిన లిమిటెడ్, కాలిగ్రఫీ ట్రిమ్‌లలో ఉన్న సుమారు 68,500 వాహనాలను రీకాల్ చేయాలని సంస్థ నిర్ణయించింది. మార్చి 7న అమెరికాలోని ఓహియోలో పవర్ సీట్ ఢీకొనడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఎస్‌యూవీ మోడల్‌లోని రెండో, మూడో వరుసల్లో ఉన్న పవర్ సీట్ల భద్రతా వ్యవస్థలో లోపం ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ సీట్లలో ఎవరైనా వ్యక్తి, పిల్లలు, వస్తువు తగిలితే సీటు కదలకుండా ఉండే ఆక్యుపెంట్ డిటెక్షన్ సిస్టమ్ పనిచేస్తుంది. అయితే, కొన్ని వాహనాల్లో ఈ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ప్రమాదాలకు అవకాశం ఉందని విచారణలో తేలింది.
ఈ ఘటనపై సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని పేర్కొంది. ఇదే సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. రీకాల్‌లో భాగంగా మొత్తం సుమారు 68,500 వాహనాలు రీక్ చేయనుంది. ఇందులో యూఎస్‌లో 60,500, కెనడాలో 8వేల వాహనాలున్నాయి. ఇవన్నీ 2026 మోడల్ సంబంధించిన హ్యుందాయ్ పాలిసేడ్ లిమిలెడ్, కాలిగ్రఫీ ట్రిమ్‌లే.
సమస్యను పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ ఫీచర్స్‌ను అప్‌డేట్ చేసే పనిలో ఉన్నట్లు హ్యుందాయ్ పేర్కొంది. ఇందు కోసం ఓవర్-ద-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విడుదల చేయాలని సంస్థ యోచిస్తోంది. ఈ అప్‌డేట్ ద్వారా సీటు సెన్సార్‌ల రెస్పాన్స్‌ను మెరుగుపరచడంతో పాటు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్స్‌ను జోడించనుంది. ఈ అప్‌డేట్ మార్చి చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ప్రభావిత వినియోగదారులకు కంపెనీ తాత్కాలిక సాయం అందిస్తోంది.
అవసరమైన వారికి ప్రత్యామ్నాయ రెంటల్ వాహనాలు ఇవ్వడం, సమస్య పరిష్కారం అయ్యే వరకు తాత్కాలిక సహాయం చేయడం వంటి చర్యలు చేపడుతోంది. అలాగే పవర్ సీట్ ఉపయోగించే సమయంలో సీటు ఫోల్డింగ్ ప్రాంతంలో పిల్లలు, ఇతరలు ఎవరూ కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అమెరికా వెహికిల్ సెక్యూరిటీ సంస్థ అయిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సైతం ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా స్పందించలేదు.
ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ కంపెనీలు భద్రతా వ్యవస్థలపై మరింత శ్రద్ధ చూపుతున్నాయి. ఆధునిక కార్లలో ఆక్యుపెంట్ డిటెక్షన్ సెన్సార్‌లు, ఆటోమేటిక్ సీట్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌లు, చైల్డ్ సేఫ్టీ అలర్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఎక్కడైనా సాంకేతిక లోపాలు బయటపడితే కంపెనీలు వెంటనే రీకాల్‌లు ప్రకటించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి.
తాజావార్తలు
- ●Un Employees | నవంబర్ 7న మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు
- ●MLC Dasoju Sravan | నిరుద్యోగుల మొర వినండి.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చండి
- ●Music Director Deva | దిగ్గజ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత - నాలుగు వందల సినిమాలకు స్వరకర్తగా...
- ●Windows 11 | 8 జీబీ ర్యామ్ పీసీ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ 11 వేగం 20 శాతం పెంపు..
- ●Chamala Kirankumar Reddy | భూమంతా ఎల్‌నినో ఉంటే.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మాత్రం లేదు
- ●Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Un Employees | నవంబర్ 7న మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు

MLC Dasoju Sravan | నిరుద్యోగుల మొర వినండి.. బేషజాలకు పోకుండా పరీక్షల తేదీలు మార్చండి

Music Director Deva | దిగ్గజ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత - నాలుగు వందల సినిమాలకు స్వరకర్తగా...

Windows 11 | 8 జీబీ ర్యామ్ పీసీ యూజర్లకు గుడ్‌న్యూస్.. విండోస్ 11 వేగం 20 శాతం పెంపు..






