Donald Trump | ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడి సవాల్
Donald Trump | మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలను ఉద్దేశిస్తూ పద్ధతి మార్చుకోకపోతే వెనిజులా పరిస్థితే ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యల పట్ల కొలంబియా (Columbia) అధ్యక్షుడు గుస్తావో పేట్రో స్పందిస్తూ “నేను ఇక్కడే ఉన్నాను, రావాలంటే రండి, నన్ను బెదిరించొద్దు” అంటూ సవాల్ విసిరాడు.
International | Published On Jan 6, 2026, 8.03 pm IST
Donald Trump | వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) ను నిర్బంధించిన అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇతర లాటిన్ అమెరికా దేశాలను తీవ్రంగా హెచ్చరించారు. మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలను ఉద్దేశిస్తూ పద్ధతి మార్చుకోకపోతే వెనిజులా పరిస్థితే ఎదుర్కోవలసి వస్తుందని ఒక రకంగా బెదిరించారు. ట్రంప్ వ్యాఖ్యల పట్ల కొలంబియా (Columbia) అధ్యక్షుడు గుస్తావో పేట్రో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను ఇక్కడే ఉన్నాను, రావాలంటే రండి, నన్ను బెదిరించొద్దు” అంటూ సవాల్ విసిరాడు. దేశంపై దాడి వస్తే “దేశాన్ని రక్షించడానికి తాను మళ్లీ ఆయుధం ఎత్తేందుకు సిద్ధం” అని చెప్పి, ప్రజల మద్దతుతో తాను రక్షణలో నిలబడతానని పేట్రో ప్రకటించాడు. ఆయుధాన్ని పట్టుకోనని గతంలో ప్రమాణం చేశానని, అయితే, మాతృభూమి కోసం అవసరమైతే వాటిని మళ్లీ చేపడతానని చెప్పారు. గతంలో గెరిల్లా పోరాటంలో పనిచేసిన గుస్తావో 1990లలో తుపాకీ విడిచిపెట్టాడు. వెనిజులాపై దాడిని తీవ్రంగా ఖండిస్తూనే కొలంబియాపై సైనిక చర్య చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






