Stock Markets | ట్రంప్ ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లు క్రాష్.. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు లాస్
అమెరికా విధించబోయే కొత్త టారిఫ్‌ల గురించి ఉన్న ఆందోళనలే దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అలాగే విదేవీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) వరుసగా నాలుగో రోజు అమ్మకాలు చేపట్టారు.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు గురువారం క్రాష్ అయ్యాయి. భారీ నష్టాలను చవి చూశాయి. ఇది భారీ క్రాష్ కాకపోయినా నిఫ్టీ 50 ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టంతో ముగిసింది. 263.90 పాట్లు నష్టపోయి 25,876 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 0.92 శాతం పడిపోయి 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 304.35 పాయింట్లు నష్టపోయింది. 0.51 శాతం పడి 59,686.50 వద్ద ముగిసింది.
అమెరికా టారిఫ్‌ల భయమేనా?
అమెరికా విధించబోయే కొత్త టారిఫ్‌ల గురించి ఉన్న ఆందోళనలే దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అలాగే విదేవీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) వరుసగా నాలుగో రోజు అమ్మకాలు చేపట్టారు. మరోవైపు డాలర్ మారకంతో రూపాయి విలువ కూడా పడిపోవడంపై మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈక్విటీ స్టాక్స్‌లో స్వల్పకాల ఒత్తిడి ఉందని.. దీర్ఘకాలంలో వృద్ధి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు భారీగా నష్టపోయాయి. అమెరికాకు ఎగుమతులు చేసే టెక్స్‌టైల్స్, ఫార్మా, ఐటీ కంపెనీల షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి.
8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఒక్క రోజులోనే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా పడిపోవడంతో మదుపర్ల సంపద రూ.8 లక్షల కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం విలువ రూ.480 లక్షల కోట్లు కాగా, గురువారం నష్టం రూ.8 లక్షల కోట్లు పోగా రూ.472 కోట్లకు చేరుకోవడం గమనార్హం.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






