త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సిడ్నీ బాండీ బీచ్‌లో కాల్పులు జరిపిన దుండగుడు ఇతడే

ఈ దాడిపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ స్పందించారు. తీవ్ర దిబ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతియుతంగా పండుగ జరుపుకుంటున్న అమాయకులపై దాడి జరగడం హేయమైనదన్నారు. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అని స్పష్టం చేశారు.

J

International | Published On Dec 14, 2025, 7.10 pm IST

సిడ్నీ బాండీ బీచ్‌లో కాల్పులు జరిపిన దుండగుడు ఇతడే
Advertisement

ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సిడ్నీ బాండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యూదుల పండుగ అయిన హనుక్కా వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అక్కడికి దూసుకొచ్చిన దుండగులు అక్కడ బీచ్‌లో వేడుకలు జరుపుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఖచ్చితంగా ఉగ్రదాడే అని పోలీసులు నిర్ధారించారు.

ఒక దుండగుడు మృతి.. మరోకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స

ఇద్దరు దుండగులు నల్లని దుస్తులు ధరించి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు దుండగులపై ఎదురు కాల్పులు జరపగా ఒక దుండగుడు మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ దుండగుడిని ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నారు.

అయితే.. కాల్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వంతెన పై నుంచి కాల్పులు జరపడం, ఓ సామాన్య పౌరుడు ధైర్యంగా ముందుకెళ్లి ఇద్దరు దుండగులకు అడ్డుకోవడానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాల్పులకు తెగబడిన దుండగుడు వీడే అంటూ అతడి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అతడి పేరు నవీద్ అక్రమ్ అని. అతడిది పాకిస్థాన్ అని కూడా చెబుతున్నారు.

ఈ దాడి అత్యంత హేయమైనది

ఈ దాడిపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ స్పందించారు. తీవ్ర దిబ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతియుతంగా పండుగ జరుపుకుంటున్న అమాయకులపై దాడి జరగడం హేయమైనదన్నారు. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అని స్పష్టం చేశారు.

యూదు సమాజమే లక్ష్యంగా

ఈ బీచ్‌లో యూదు సమాజం ఎక్కువగా ఉండటం, వాళ్లే వేడుకల కోసం రావడంతో వాళ్లనే టార్గెట్‌గా చేసుకొని ఉగ్రదాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కారులో పేలుడు పదార్థాలను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇంకా ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారు అనే దానిపై విచారణ జరుపుతున్నామని పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ మీడియాకు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement