Sydney Shooting | ఆస్ట్రేలియా బాండై బీచ్‌లో ఉగ్ర దాడి: 12మంది మృతి
సిడ్నీ బాండై బీచ్‌లో హానుకా యూదు పండుగ సందర్భంగా జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 12 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఇద్దరు దుండగులు కాల్పులు జరపగా, ఒకరిని పోలీసులు హతమార్చారు. ఘటనను యూదు విద్వేష ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా అధికారులు ప్రకటించారు.
International | Published On Dec 14, 2025, 11.40 pm IST
Terror Attack at Bondi Beach: 12 Killed in Anti-Semitic Shooting During Hanukkah Event
సిడ్నీ, డిసెంబర్ 14, 2025:
ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రసిద్ధ బాండై బీచ్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన భయానక సామూహిక కాల్పుల్లో 12 మంది మృతి చెందగా, 29 మందికి గాయాలయ్యాయి. యూదుల పవిత్ర పండుగ హానుకా (Chanukah) తొలి రోజున “Chanukah by the Sea” పేరుతో జరిగిన భారీ మత–సాంస్కృతిక వేడుకను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి యూదు విద్వేష దాడి అని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ అధికారికంగా ప్రకటించారు.
సాయంత్రం 7 గంటల సమయంలో (స్థానిక సమయం ప్రకారం 6:45 pm) ఇద్దరు దుండగులు పొడుగాటి తుపాకులతో ఆర్చర్ పార్క్ ప్రాంతంలో ఉన్న హానుకా ఈవెంట్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సాక్షుల కథనం ప్రకారం కాల్పులు సుమారు 10 నిమిషాలు కొనసాగాయి. దాడి సమయంలో ఈవెంట్‌లో 1,000 మందికి పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులు మొదలైన వెంటనే వందలాది మంది ప్రాణాల కోసం బీచ్ దిశగా, వీధుల వైపు పరుగులు తీశారు.

పోలీసుల ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు. రెండో దుండగుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. దుండగుల వాహనంలో IEDs (Improvised Explosive Devices) కనుగొనడం పోలీసులను మరింత ఆందోళనకు గురిచేసింది. బాంబ్ స్క్వాడ్ వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేసింది. ప్రస్తుతం వీరిద్దరేనా, మూడో వ్యక్తి ప్రమేయమేమైనా ఉందా, ఇంకా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎక్కడైనా ఉన్నాయా అన్న దిశలో దర్యాప్తు కొనసాగుతోంది.
సంఘటనాస్థలిలో ఉన్న ఒక పౌరుడు కాల్పులు జరుపుతున్న దుండగుడి పైకి దూకి, అతన్ని నిరాయుధుడిని చేసాడు. అయితే ఈ సందర్భంగా అతను గాయపడ్డాడు. దేశమంతా ఆయన్ను ఇప్పుడు హీరోగా పొగుడుతున్నారు.
After Brown University, massive shooting was seen during the festival of Hanukkah on the Jewish people at Bondi Beach in Sydney Australia
Seen here is a brave man single handedly taking down on the shooter
Incredible pic.twitter.com/DfoFzVKYjv
— Dennis jacob (@12431djm) December 14, 2025
హానుకా అంటే ఏమిటి?

యూదుల పవిత్ర పండుగ హానుకా (Festival of Lights) ఎనిమిది రోజులపాటు జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 14 నుంచి 22 వరకు జరగనున్న ఈ పండుగ మక్కబీ తిరుగుబాటు, యెరూషలేము ఆలయ పునర్నిర్మాణం, మరియు ఒక రోజు సరిపడే నూనె ఎనిమిది రోజులపాటు వెలిగిన అద్భుతాన్ని గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా ప్రతి రోజు మెనోరా (9 బ్రాంచ్‌ల దీపస్తంభం)లో ఒక కొత్త దీపం వెలిగిస్తారు.
ప్రపంచ నాయకుల స్పందనలు
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ ఈ దాడిని పైశాచిక చర్యగా, యూదు విద్వేష ఉగ్రదాడి అని తీవ్రస్థాయిలో ఖండించారు. యాంటీ–సెమిటిజం(యూదులపై ద్వేషం) అనేది తమ దేశ విలువలకు వ్యతిరేకమని చెప్పారు.
ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆస్ట్రేలియా ప్రభుత్వం యాంటీ–సెమిటిజంపై తగిన కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. కింగ్ చార్ల్స్ III, డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీతో పాటు మరికొన్ని దేశాల నేతలు ఈ తీవ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకించి న్యూయార్క్, లండన్, బెర్లిన్ నగరాల్లో జరుగుతున్న హానుకా ఈవెంట్లకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
దాడి కారణాలు, కుట్ర నేపథ్యం, అంతర్జాతీయ సంబంధాలు—అన్నీ అధికారుల విచారణలో కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనతో ఆస్ట్రేలియా యూదు సమాజంలో తీవ్ర విషాదం, ఆందోళన నెలకొన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

India-US tariff | భారత్‌పై యూఎస్ టారిఫ్ 10 శాతమా? లేక 18 శాతమా? 13.5 శాతమా?
ఫిబ్రవరి 21, 2026

Hanukkah Festival | బొండై బీచ్‌లో హనుక్కా వేడుకల్లోనే కాల్పులు.. అసలేంటీ పండుగ? ప్రాముఖ్యత ఏంటి?
డిసెంబర్ 18, 2025

Türkiye Sinkholes | సింక్హోల్స్తో ఆహార సంక్షోభం : టుర్కీయేలో పొలాలను మింగుతున్న భూమి
డిసెంబర్ 16, 2025
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



