సిడ్నీ మారణహోమం.. పాకిస్థాన్‌కు చెందిన తండ్రీకొడుకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు
ఆస్ట్రేలియా ఘటనపై భారత నిఘా వర్గాలు కూడా అప్రమత్తం అయ్యాయి. పాకిస్థాన్‌కి చెందిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడటంతో భారత్‌లోని పలు మెట్రో నగరాలు, చారిత్రక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి.
International | Published On Dec 15, 2025, 10.21 am IST
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఫేమస్ బోండీ బీచ్‌లో డిసెంబర్ 14న జరిగిన మారణహోమం ప్రపంచాన్ని కుదిపేసింది. బీచ్‌లో యూదుల పండుగ జరుగుతున్న నేపథ్యంలో వేల కొద్ది ప్రజలు అక్కడికి చేరుకొని వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇంతలోనే ఇద్దరు సాయుధులైన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు దుండగులను పోలీసులు గుర్తించారు. వీళ్లిద్దరూ పాకిస్థాన్‌కు చెందిన తండ్రీకొడుకులని పోలీసులు స్పష్టం చేశారు.
కాల్పుల్లో సాజిద్ అక్రమ్ మృతి
పోలీసుల సమాచారం ప్రకారం, కాల్పులకు తెగబడింది పాకిస్థాన్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు. వాళ్లు కూడా తండ్రీకొడుకులే. ఒకరు 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, అతడి కొడుకు 24 ఏళ్ల నవీద్ అక్రమ్.
కాల్పుల సమయంలో పోలీసులు ఎదురు కాల్పులు జరుపడంతో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల్లో గాయపడ్డ నవీద్ అక్రమ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం నవీద్ చికిత్స పొందుతున్నాడు.
వీళ్లిద్దరూ పాకిస్థాన్ జాతీయులే అని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ వెల్లడించారు. సాజిద్ అక్రమ్, అతడి కొడుకు నవీద్ అక్రమ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
30 ఏళ్ల తర్వాత అతి పెద్ద దాడి
ఆస్ట్రేలియా అంటేనే కఠినమైన చట్టాలు ఉంటాయి. తుపాకీ విషయంలో అయితే ఆ చట్టాలు ఇంకా కఠినంగా ఉంటాయి. అలాంటి ఆస్ట్రేలియాలో తుపాకుల మోత మోగడం అనేది అక్కడి ప్రభుత్వాన్ని విస్మయానికి గురి చేసింది. గత మూడు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన కాల్పుల ఘటన ఇదేనని అధికారులు తెలిపారు.
1000 మంది యూదుల సమావేశం
హనుక్కా వేడుకలు జరుపుకోవడం కోసం బోండీ బీచ్ పక్కనే ఉన్న చిన్న పార్క్‌లో 1000 మంది వరకు యూదులు సమావేశం అయ్యారు. అదే సమయంలో దుండగులు విచక్షణారహితంగా గన్‌తో విరుచుకుపడటంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు.
ఆస్ట్రేలియా ఘటనపై భారత నిఘా వర్గాలు కూడా అప్రమత్తం అయ్యాయి. పాకిస్థాన్‌కి చెందిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడటంతో భారత్‌లోని పలు మెట్రో నగరాలు, చారిత్రక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి.
This is one of the #terrorist who killed so many innocent people in #bondibeach #Australia he is named as Naveed Akram of #pakistani origin, confirmed by australian media.
Pay close look the terrorist in the driving licence picture wears a pakistani cricket shirt. #Dhurandhar pic.twitter.com/A0ISdL5S7P— Wahdat Jalal (@WahdatJ) December 14, 2025
Video shows Islamist terrorist shooting over Jewish people, at Sydney's Bondi Beach, Australia. pic.twitter.com/xOhZRP8E48
— Sujal Singh (@sujalsingh_x) December 15, 2025
Muslim father of 2 Ahmed al Ahmed tackles Bondi gunman in Sydney. He's been hailed as a hero.
#nzpol #kiwi #Bondi #Muslim #auspol pic.twitter.com/D2qxkuVXku
— Mountain_Tui (@Mountain_Tui) December 15, 2025
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






