యూఎస్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. యూఎస్ లోని అలబామా యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు.. బర్మింగ్‌హామ్‌లో ఉంటున్నారు. అక్కడ ఉన్న ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వాళ్లతో పాటు మరో 10 మంది తెలుగు విద్యార్థులు అక్కడే ఉంటున్నారు. వారు ఉన్న అపార్ట్మెంట్లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు మంటల్లో చిక్కుకుపోయి మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.