త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

USA Road Accident | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు స్పాట్ డెడ్

దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ పిల్లల మృతదేహాలను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నారు. వాళ్ల ఆఖరి చూపు అయినా చూసుకునేలా చేయాలని కోరుతున్నారు.

J

International | Published On Dec 29, 2025, 3.04 pm IST

USA Road Accident | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు స్పాట్ డెడ్
Advertisement

USA Road Accident |అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. ఈ ఘటన యూఎస్‌లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు కాలిఫోర్నియాలో ఉంటున్నారు. మాస్టర్స్ పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. తాజాగా తమ ఫ్రెండ్స్‌తో కలిసి కారులో సరదాగా బయటికి వెళ్లారు. ఈనేపథ్యంలో అలబామా హిల్స్ వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు యువతులు మేఘనారాణి, భావన స్పాట్‌లో మృతి చెందారు.

పుల్లకందం మేఘనారాణి వయసు 25 కాగా, ఆమె స్వగ్రామం జిల్లాలోని గార్ల మండలం. 24 ఏళ్ల కడియాల భావనది జిల్లాలోని ముల్కనూర్ గ్రామం. మూడేళ్ల క్రితమే ఇద్దరు యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి వెళ్లారు. మాస్టర్స్ పూర్తయి త్వరలో ప్లేస్‌మెంట్ కూడా వచ్చే సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్న వాళ్ల ఫ్రెండ్స్‌కి తీవ్రగాయాలు కాగా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం గురించి ఇద్దరు యువతుల కుటుంబ సభ్యులకు యూఎస్ అధికారులు సమాచారం అందించారు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ పిల్లల మృతదేహాలను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్ అధికారులను సంప్రదించి తమ పిల్లల ఆఖరి చూపు అయినా నోచుకునేలా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement