త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Elon Musk | పదేళ్లలో చంద్రుడిపై నగరం నిర్మాణం : ఎలాన్ మ‌స్క్‌

Elon Musk | స్పేస్ ఎక్స్ అధినేత‌, బిలియ‌నీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మంచ‌డంపై (self-growing city on the Moon) స్పేస్ ఎక్స్ (SpaceX) దృష్టిసారించింద‌ని ప్ర‌క‌టించారు.

D

International | Published On Feb 9, 2026, 10.14 am IST

Elon Musk | పదేళ్లలో చంద్రుడిపై నగరం నిర్మాణం : ఎలాన్ మ‌స్క్‌
Advertisement

Elon Musk | స్పేస్ ఎక్స్ అధినేత‌, బిలియ‌నీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మంచ‌డంపై (self-growing city on the Moon) స్పేస్ ఎక్స్ (SpaceX) దృష్టిసారించింద‌ని ప్ర‌క‌టించారు. ఇది ప‌దేళ్ల‌లోనే పూర్త‌వుతుంద‌ని మ‌స్క్ తెలిపారు. అంగారకుడితో పోలిస్తే చంద్రుడిపై నగరాన్ని నిర్మించడం చాలా వేగంగా సాధ్యమవుతుందని ఈ సంద‌ర్భంగా మస్క్ వివరించారు.

"మార్స్ (Mars)కు ప్ర‌యాణించాలంటే.. గ్ర‌హాలు అనుకూలించాలి. అందుకోసం 26 నెల‌లు ఆగాల్సి ఉంటుంది. ప్ర‌యాణానికి దాదాపు ఆరు నెల‌లు ప‌డుతుంది. అదే చంద్రుడిపైకి మాత్రం ప‌ది రోజుల‌కు ఒక‌సారి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపొచ్చు. ప్ర‌యాణాకికి కూడా కేవ‌లం రెండు రోజులే ప‌డుతుంది. దీనివ‌ల్ల న‌గ‌ర నిర్మాణ ప‌నులు కూడా వేగంగా పూర్తి చేయొచ్చు. స్పేస్ ఎక్స్ ఇప్ప‌టికే చంద్రునిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించ‌డంపై దృష్టిసారించింది. ఇందుకు 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ స‌మ‌యే ప‌డుతుంది. అదే మార్స్‌పై న‌గ‌రాన్ని అభివృద్ధి చేయాలంటే 20 సంవ‌త్స‌రాల‌కు పైనే ప‌డుతుంది" అని మ‌స్క్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

అంతేకాదు, అంగారకుడిపై నగరం నిర్మించే ప్రణాళికను పూర్తిగా విరమించుకోలేదని మస్క్ ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. "రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో మార్స్ నగరంపై కూడా పనులు ప్రారంభిస్తాం. కానీ, ప్రస్తుతానికి మాత్రం నాగరికత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై నగర నిర్మాణానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement