Supreme Court | డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. సుంకాలు చట్ట విరుద్ధమన్న అమెరికా సుప్రీంకోర్టు..!
Supreme Court | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. గతంలో పలు దేశాలపై ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమంటూ అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ప్రపంచదేశాలపై విస్తృత స్థాయిలో ట్రంప్ టారిఫ్లు విధించడం ఫెడరల్ చట్టానికి విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
International | Published On Feb 20, 2026, 8.52 pm IST
Supreme Court | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. గతంలో పలు దేశాలపై ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమంటూ అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ప్రపంచదేశాలపై విస్తృత స్థాయిలో ట్రంప్ టారిఫ్లు విధించడం ఫెడరల్ చట్టానికి విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వైట్ హౌస్‌కు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గతేడాది గత ఏడాది వలసలు, స్వతంత్ర సంస్థల అధిపతుల తొలగింపు, ప్రభుత్వ ఖర్చుల్లో కోతలు తదితర అంశాల్లో కోర్టు అధ్యక్షుడి పక్షాన తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జాన్ మెజారిటీ అభిప్రాయాన్ని వెల్లడించారు. 6-3 మెజారిటీతో కోర్టు సుంకాల విధానం చట్టం నిర్దేశించిన పరిమితులను మించిందని తేల్చింది. అధ్యక్షుడు పరిమితి లేకుండా, ఎంతకాలమైనా, ఎంత మొత్తానికైనా సుంకాలు విధించే అధికారం ఉందని వాదించారు. అయితే, అలాంటి అధికారం వినియోగించాలంటే కాంగ్రెస్ నుంచి స్పష్టమైన అనుమతి ఉండాలని రాజ్యాంగం సూచిస్తోంది. ట్రంప్ ఆధారంగా చూపిన అత్యవసర అధికారాలు ఈ సందర్భంలో సరిపోవని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ట్రంప్ వాణిజ్య విధానాలపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



