ఇక నుంచి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ‘బుర్జ్ ఖలీఫా’ కాదు
బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌ని డిజైన్ చేసిన అడ్రియన్ స్మిత్ ఈ బిల్డింగ్‌ని కూడా డిజైన్ చేశాడు. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునేలా ఈ బిల్డింగ్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో హైస్పీడ్ ఎలెవేటర్స్‌ని ఏర్పాటు చేయనున్నారు.
International | Published On Dec 19, 2025, 4.43 pm IST
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్(world's tallest building) ఏది? అని స్కూల్‌కి వెళ్లే విద్యార్థిని అడిగినా టక్కున దుబాయ్(Dubai)లో ఉన్న బుర్జ్ ఖలిఫా(Burj Khalifa) అని చెబుతాడు. కొన్ని పరీక్షల్లో కూడా ఈ ప్రశ్నను అడుగుతుంటారు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అంత ఎత్తైన బిల్డింగ్‌ని ఎవ్వరూ ఇప్పటి వరకు కట్టలేకపోయారు. అందుకే అది ఒక స్పెషల్ బిల్డింగ్ అయింది. ప్రపంచాన్నే అబ్బురపరిచింది. బుర్జ్ ఖలిఫా కట్టడం కూడా ఓ వింతే. అందుకే దాని పేరు మీద ఉన్న రికార్డులను లెక్కపెట్టలేం కూడా. ఈ బిల్డింగ్‌లో మొత్తం 163 అంతస్తులు ఉంటాయి. 100 ఫ్లోర్లు పైకి వెళ్లాక అక్కడి నుంచి వ్యూ చూస్తే అదిరిపోతుంది. బుర్జ్ ఖలీఫాలో 122 వ ఫ్లోర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెస్టారెంట్ ఉంటుంది. కింద వ్యూ చూస్తూ ఆ రెస్టారెంట్‌లో కస్టమర్లు ఫుడ్ లాగించేస్తుంటారు. 2004 లో ఈ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభం కాగా, ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి కావడానికి 6 ఏళ్లు పట్టింది. 12 వేల మంది కార్మికులు నిరంతరం శ్రమించి ఈ బిల్డింగ్‌ని నిర్మించారు. 1.5 బిలియన్ డాలర్లు నిర్మాణం కోసం ఖర్చయింది. అంటే మన కరెన్సీలో 13,450 కోట్ల రూపాయలు అన్నమాట.
ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెబుతున్నావు అంటారా? అక్కడికే వస్తున్నా ఆగండి. ఇక నుంచి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఏది అంటే బుర్జ్ ఖలీఫా అని కళ్లు మూసుకొని కాదు.. తెరిచి కూడా చెప్పకండి. ఎందుకంటే.. దాన్ని దాటేసి మరో బిల్డింగ్ వచ్చేస్తోంది. అదే జెడ్డా టవర్(Jeddah Tower). ఇంకా అది పూర్తి కాలేదు. నిర్మాణదశలోనే ఉంది. 2028 లోపు దాని నిర్మాణం పూర్తవుతుంది. జనవరి 2025 నుంచి దీని నిర్మాణం ప్రారంభం కాగా ఇప్పటికే 80 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒక ఫ్లోర్‌ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 1000 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం కానుంది. అంటే ఒక కిలోమీటరు ఎత్తు వరకు దీన్ని నిర్మిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా కంటే 180 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లే. అందుకే.. జెడ్డా టవర్ నిర్మాణం మొత్తం పూర్తయితే ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌గా బుర్జ్ ఖలీఫాను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్రను సృష్టించనుంది. సౌదీ అరేబియా విజన్ 2030(Saudi Arabia Vision 2030) లో భాగంగా ఈ జెడ్డా టవర్‌ని నిర్మిస్తున్నారు. జెడ్డా ఎకనామిక్ సిటీ(Jeddah Economic City)లో ఈ టవర్‌ని నిర్మిస్తున్నారు. 160 ఫ్లోర్ల వరకు నిర్మాణం ఉంటుంది. హోటల్స్, లగ్జరీ నివాసాలు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హైఎండ్ ఆఫీస్ స్పేస్‌లను ఈ టవర్‌లో ఏర్పాటు చేయనున్నారు. జెడ్డా టవర్ పైనుంచి చూస్తే రెడ్ సీ వ్యూ భలేగా కనిపించనుంది. అలాగే సౌదీ సిటీ మొత్తం కనిపిస్తుంది.
🧵Jeddah Tower is roaring back to life. Construction officially restarted Jan 2025 after a 7-year stall—now at 78 floors (Nov 2025), climbing fast with a new crane adding levels every 3-4 days. Aiming for 1,008m+ (over 1km), it'll smash Burj Khalifa's 828m record by 173m+ by 2028 pic.twitter.com/BbwzUMimkx
— Tobitontoff (@tobitontoff) December 13, 2025
బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌ని డిజైన్ చేసిన అడ్రియన్ స్మిత్ ఈ బిల్డింగ్‌ని కూడా డిజైన్ చేశాడు. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునేలా ఈ బిల్డింగ్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో హైస్పీడ్ ఎలెవేటర్స్‌ని ఏర్పాటు చేయనున్నారు. ఒక సెకండ్‌కి 10 మీటర్ల పైకి వెళ్లేలా ఈ టవర్‌లో ఎలెవేటర్స్ పని చేయనున్నాయి.
సంబంధిత వార్తలు

Pakistan Troops in Saudi Arabia | ఇరాన్‌తో వార్.. సౌదీ అరేబియాకు 8,000 మంది పాక్ సైనికులు, ఫైటర్ జెట్స్
మే 18, 2026

Air India Flight | ఫైర్ వార్నింగ్.. ముంబైకి రావాల్సిన విమానం సౌదీకి మళ్లింపు
మార్చి 20, 2026

US Air Force Refueling Planes | సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. దెబ్బతిన్న 5 అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు
మార్చి 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



