TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్..
TGPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2న రెండు శాఖల్లో ఖాళీగా ఉన్న 290 పోస్టులతో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 ఉప విద్యాధికారులు/ గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయుల (Deputy Educational Officers/Gazetted Head Master Grade-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది.
TGPSC | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2న రెండు శాఖల్లో ఖాళీగా ఉన్న 290 పోస్టులతో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాల విద్యా శాఖలో ఖాళీగా ఉన్న 24 ఉప విద్యాధికారులు/ గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయుల (Deputy Educational Officers/Gazetted Head Master Grade-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఇందులో మల్టీజోన్ 1లో 10 ఖాళీలు, మల్టీజోన్ 2లో 14 ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు ప్రతి నెల రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు వేతనం అందుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 24
- మల్టీజోన్-1లో 10, మల్టీజోన్-2లో 14 ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ, బీఈడీ పూర్తిచేయాలి. 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 44 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏండ్లు, దివ్యాంగులకు 5, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏండ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 12
అప్లికేషన్లకు చివరితేదీ: జూన్ 19
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యడీ అభ్యర్థులకు రూ.500
ఎగ్జామినేషన్ ఫీజు: రూ.120
పరీక్ష: అక్టోబర్‌లో
హాల్‌టికెట్లు: పరీక్షకు వారం రోజుల ముందు..
వెబ్‌సైట్: https://www.tgpsc.gov.in
తాజావార్తలు
- ●Sahara Desert | సహారా ఎడారిలో చెడిపోయిన లారీ.. నీరు దొరక్క దూపతో 49 మంది మృతి
- ●Kaleshwaram Temple | కాళేశ్వర ఆలయ పునర్నిర్మాణం.. ఈ నెల 17న పనులు ప్రారంభం
- ●Heavy Rain Alert | ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
- ●Indian Grey Hornbill | విశిష్ట అతిథి హార్న్‌బిల్.. జీవితాంతం ఒకే భాగస్వామితో..
- ●Praggnanandhaa | చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా రికార్డ్
- ●Horoscope | జూన్ 6 రాశి ఫలాలు.. ఈ రాశివారిని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి!

Sahara Desert | సహారా ఎడారిలో చెడిపోయిన లారీ.. నీరు దొరక్క దూపతో 49 మంది మృతి

Kaleshwaram Temple | కాళేశ్వర ఆలయ పునర్నిర్మాణం.. ఈ నెల 17న పనులు ప్రారంభం

Heavy Rain Alert | ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Indian Grey Hornbill | విశిష్ట అతిథి హార్న్‌బిల్.. జీవితాంతం ఒకే భాగస్వామితో..






