Sahara Desert | సహారా ఎడారిలో చెడిపోయిన లారీ.. నీరు దొరక్క దూపతో 49 మంది మృతి
Sahara Desert | అసలే అది సహారా ఎడారి (Sahara Desert). ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో లారీ చెడిపోయింది. రోజులు గడుస్తున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గొంతులు ఎండిపోతున్నాయి. ఎటు చూసినా ఇసుక దిబ్బలే.
International | Published On Jun 6, 2026, 9.28 am IST
Sahara Desert | త్రినేత్ర.న్యూస్: అసలే అది సహారా ఎడారి (Sahara Desert). ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా దారి మధ్యలో లారీ చెడిపోయింది (Truck Breakdown). రోజులు గడుస్తున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గొంతులు ఎండిపోతున్నాయి. ఎటు చూసినా ఇసుక దిబ్బలే. మైళ్లకొద్ది నడిచినా చుక్కనీరు దొరకలే. దీంతో దూపతో (Thirst) 49 మంది మరణించారు. ఈ తీవ్ర విషాద ఘటన ఆఫ్రికా దేశమైన నైజర్‌లో (Niger) చోటుచేసుకుంది. అయితే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు దక్కించుకోవడం గమనార్హం.
ముస్లి పండుగ కోసం 51 మంది మాలి దేశంలోని హరూబా పట్టణం వెళ్లారు. ఉత్సవం ముగిసిన తర్వాత లారీలో స్వస్థలానికి తిరిగి వస్తున్నారు. నైజర్-ఆల్జీరియా సరిహద్దులోని అస్సామాకాకు (Assamaka) పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఒక్కసారిగా వాహనం చెడిపోయింది. దానిని బాగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ లాభం లేకుండాపోయింది. చూస్తుండగానే మూడు రోజులు గడిచిపోయాయి. ఎండ తీవ్రత విపరీతంగా ఉండటంతోపాటు చుట్టుపక్కల తాగడానికి చుక్క నీరు దొరక్కపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. మూడు రోజుల పాటు నీరు తాగకుండానే గడిపేశారు. దీంతో దాహంతో 49 మంది ఎడారిలోనే ప్రాణాలు విడిచారు.

80 కిలోమీటర్లు నడిచి..
అయితే ఈ దుర్ఘటన నుంచి ఇద్దరు వ్యక్తులు బయటపడటం విశేషం. తమ కళ్ల ముందే తోటి ప్రయాణికులు చనిపోతుండటంతో ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని సహాయం కోసం ఎడారిలో దాదాపు 80 కిలోమీటర్ల మేర నడిచారు. ఎట్టకేలకు ఓ పట్టణానికి చేరుకుని, అక్కడి స్థానిక అధికారులకు తాము ఎదుర్కొన్న నరకాన్ని వివరించారు. దీంతో రెస్క్యూ టీమ్స్, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. లారీ చుట్టూ మృతదేహాలు కనిపించడంతో చలించిపోయారు. వారిని అక్కడే ఖననం చేశారు.
తాజావార్తలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
- ●BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
- ●One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్
- ●Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●One Nation One Election | 2029లో జమిలి సాధ్యమే.. రాష్ట్రాలదే తుది నిర్ణయం : జేపీసీ చైర్మన్
- ●Minors Arrest | గేమింగ్ కోసం డబ్బుల్లేవు.. అప్పుడే ఓ తాళం కనబడింది

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..

BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం

One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు




