త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India | ఇరాన్‌తో యుద్ధం.. మే 31 వ‌ర‌కు ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమానాలు ర‌ద్దు

Air India | దేశంలో ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వ‌చ్చే నెల‌ 31 వ‌ర‌కు ఇజ్రాయెల్‌కు (Israel) విమానాలను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇరాన్‌తో యుద్ధం (Iran War) నేప‌థ్యంలో ఢిల్లీ-టెల్ అవీవ్ మ‌ధ్య స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది.

G

National | Published On Apr 6, 2026, 7.07 am IST

Air India | ఇరాన్‌తో యుద్ధం.. మే 31 వ‌ర‌కు ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమానాలు ర‌ద్దు
Advertisement

Air India | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వ‌చ్చే నెల‌ 31 వ‌ర‌కు ఇజ్రాయెల్‌కు (Israel) విమానాలను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇరాన్‌తో యుద్ధం (Iran War) నేప‌థ్యంలో ఢిల్లీ-టెల్ అవీవ్ మ‌ధ్య స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇప్ప‌టికే చాలా విమానాయ‌న సంస్థ‌లు టెల్ అవీవ్ (Tel Aviv) మార్గంలో త‌మ కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్ అల్, ఇస్రాఎయిర్, ఆర్కియా, ఎయిర్ హైఫా వంటి విమానయాన సంస్థలు మాత్రమే కఠినమైన ఆంక్షల మధ్య స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నాయి.

ఎయిర్ ఇండియా తాజా నిర్ణ‌యంతో ఇజ్రాయెల్‌లో ఉన్న 40 వేల మందికిపైగా భార‌తీయులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మై కార‌ణాల వ‌ల్ల‌, ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి భార‌త్ రావాల‌నుకునే వారికి తీవ్ర నిరాశకు లోన‌వుతున్నారు. అయితే ఇజ్రాయెల్ విడిచి వెళ్లాల‌నుకునేవారు జోర్డాన్‌, ఈజిప్ట్ దేశాలకు భూమార్గాల ద్వారా ప్ర‌వేశించాల్సి ఉంటుంది.

కాగా, ఇజ్రాయెల్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం వివిధ మార్గాల ద్వారా స‌హాయం అందిస్తున్న‌ది. అక్క‌డున్న భారతీయుల‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది. 24 గంట‌లూ ప‌నిచేసేలా అత్య‌వ‌స‌ర లైన్‌ను ప్రారంభించ‌డంతోపాటు భారీ రిజిస్ట్రేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కూడా చేప‌ట్టింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో, ఆ తర్వాత కూడా నిరంతర మద్దతు కొన‌సాగుంద‌ని తెలిపింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 1న న్యూఢిల్లీ, టెల్ అవీవ్ మ‌ధ్య ప్ర‌త్య‌క్ష విమాన స‌ర్వీలు ప్రారంభ‌మ‌య్యాయి. బోయింగ్ 787 డ్రీమ్‌లైన‌ర్ విమానం వారానికి నాలుగు రోజులు సేవ‌లు అందించింది. అయితే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసిన‌ప్ప‌టి నుంచి విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

Advertisement
Advertisement