Russia | చమురు కొనుగోళ్లను ఆపేస్తున్నట్లు భారత్ మాకు చెప్పలేదు : రష్యా
Russia | రష్యా నుంచి చమురు కొనుగోళ్ల (oil purchases)ను భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనపై మాస్కో కీలక వ్యాఖ్యలు చేసింది.
International | Published On Feb 4, 2026, 11.06 am IST
Russia | చాలా రోజులుగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) తెరపడిన విషయం తెలిసిందే. భారత దిగుమతులపై ఉన్న పరస్పర (రెసిప్రొకల్) టారిఫ్‌ను 25 నుంచి 18 శాతానికి తక్షణమే తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై రష్యా తాజాగా స్పందించింది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల (oil purchases)ను భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనపై మాస్కో కీలక వ్యాఖ్యలు చేసింది.
తమ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు భారత్ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రిపెస్కోవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి భారత్ మాకు ఎలంటి నోటీసూ ఇవ్వలేదన్నారు. అదే సమయంలో భారత్-అమెరికా సంబంధాలను తాము గౌరవిస్తామన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేత..
ట్రంప్ ప్రకటన ప్రకారం, భారత్ రాబోయే సంవత్సరాల్లో అమెరికా నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు పెంచనుంది. ఇంధనం, సాంకేతిక పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర రంగాల్లో 500 బిలియన్ డాలర్లకు మించిన విలువైన ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే డీల్ కుదుర్చుకున్నట్లు ట్రంప్ చెప్పారు. దీనిని ఆయన BUY AMERICAN విధానానికి భారత్ మద్దతుగా అభివర్ణించారు. ఇదే సమయంలో, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసి, అమెరికా (అవసరమైతే వెనిజువెలా) నుంచి మరింత చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు తగ్గించడంలో సహాయపడుతుందని, యుద్ధ తీవ్రతను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు కారణంగా భారత్‌పై విధిస్తున్న మరో 25 శాతం అదనపు పన్ను విషయంలో స్పష్టత రాలేదు. కానీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపి వేసిన మరుక్షణమే ఆ 25 శాతం టారిఫ్ ను కూడా ఎత్తేస్తామని ట్రంప్ తెలిపినట్లు సమాచారం. ఇక రానున్న రోజుల్లో భారత్ అమెరికా నుంచి మొత్తం 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా దిగుమతి చేసుకోనుంది. అమెరికా ఉత్పత్తులపై రానున్న రోజుల్లో భారత్ వసూలు చేస్తున్న పన్ను 0 శాతానికి చేరుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని.. అదానీ కోసమే అమెరికాతో ట్రేడ్ డీల్ : రాహుల్ గాంధీ
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



