త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reza Amiri Moghadam | అమెరికాతో శాంతి చ‌ర్చ‌ల్లేవ్‌.. ఇరాన్ అంబాసిడ‌ర్ మొఘ‌ద్దం

Reza Amiri Moghadam | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్త‌ల‌ను ఇరాన్ ఖండించ‌డంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పాక్‌లోని ఇరాన్ రాయ‌బారి రెజా అమిరీ మొఘ‌ద్దం మాట్లాడుతూ వాషింగ్ట‌న్‌తో ఎలాంటి జ‌రుగ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

P

International | Published On Mar 25, 2026, 5.06 pm IST

Reza Amiri Moghadam | అమెరికాతో శాంతి చ‌ర్చ‌ల్లేవ్‌.. ఇరాన్ అంబాసిడ‌ర్ మొఘ‌ద్దం
Advertisement

Reza Amiri Moghadam | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్త‌ల‌ను ఇరాన్ ఖండించ‌డంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పాక్‌లోని ఇరాన్ రాయ‌బారి రెజా అమిరీ మొఘ‌ద్దం మాట్లాడుతూ వాషింగ్ట‌న్‌తో ఎలాంటి జ‌రుగ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భిన్నంగా స్పందించారు. రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో యుద్ధానికి ముగింపు వచ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఇరాన్ పూర్తిగా తిరస్కరించడం గమనార్హం.

ఇరాన్ వైఖరి కఠినంగా కనిపిస్తోంది. ప్రస్తుత యుద్ధానికి కారణం అమెరికా మోసపూరిత చర్యలేనని ఆ దేశం ఆరోపిస్తోంది. గతంలో జరిగిన చర్చలను అమెరికానే భంగపరిచిందని, నమ్మకద్రోహం కారణంగానే పరిస్థితి యుద్ధానికి దారి తీసిందని ఇరాన్ అభిప్రాయపడుతోంది. దీంతో భవిష్యత్‌లో చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇజ్రాయెల్ కూడా శాంతి చర్చలపై స్పష్టత ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి డ్యానీ డానన్ మాట్లాడుతూ తమకు ఎలాంటి చర్చల సమాచారం లేదని చెప్పారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకోసం సైనిక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అమెరికాతో కలిసి ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

అమెరికా వైపు నుంచి వచ్చిన ప్రకటనలు కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం.. ఇరాన్ సైనిక శక్తి గణనీయంగా దెబ్బతిన్నదని, అమెరికా యుద్ధవిమానాలు టెహ్రాన్‌పై నిఘా వేశాయ‌న్నారు. ఈ వ్యాఖ్యలు యుద్ధ పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. అయితే, ఇరాన్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా పలు దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ ప్రతిదాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. రెండు వైపులా సైనిక చర్యలు కొనసాగుతుండడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వ‌చ్చే సూచనలు కనిపించడం లేదు.

Advertisement

తాజావార్తలు

Advertisement