త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pope Leo | పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌.. స‌ర్జ‌రీ విజ‌య‌వంతం

Pope Leo | త్రినేత్ర న్యూస్‌: పోప్ లియో XIV (Pope Leo XIV) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న‌కు రోమ్‌లోని (Rome) జెమెల్లి హాస్పిటల్‌లో (Gemelli Hospital) శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది.

G

International | Published On Oct 14, 2026, 8.38 am IST

Pope Leo | పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌.. స‌ర్జ‌రీ విజ‌య‌వంతం
Advertisement

Pope Leo | త్రినేత్ర న్యూస్‌: పోప్ లియో XIV (Pope Leo XIV) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న‌కు రోమ్‌లోని (Rome) జెమెల్లి హాస్పిటల్‌లో (Gemelli Hospital) శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. 90 నిమిషాల పాటు జ‌రిగిన ఈ శ‌స్త్ర‌చికిత్స‌లో ఆయన కుడి ఊపిరితిత్తులోని కింది భాగాన్ని (Lower Lobe) వైద్యులు తొలగించారు. ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండానే స‌ర్జ‌రీ పూర్త‌యింద‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నార‌ని వైద్యులు వెల్ల‌డించారు. వారం రోజులపాటు హాస్పిట‌ల్‌లోనే ఉంటార‌ని తెలిపారు. ఇటీవల జరిగిన ఆరోగ్య పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో అసాధారణ పెరుగుదల కనిపించింద‌ని, క్యాన్స‌ర్ గ‌డ్డ‌ను గుర్తించిన‌ట్లు వాటిక‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించారు.

ఆపరేషన్ సమయంలో కణజాల నమూనాలను పరీక్షించామ‌ని, దానిని ఊపిరితిత్తులలో సాధారణంగా వచ్చే అడెనోకార్సినోమా (Adenocarcinoma) రకానికి చెందిన క్యాన్సర్‌గా నిర్ధారణ అయిందని హాస్పిట‌ల్‌ థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి, పోప్ ప్రధాన సర్జన్ ప్రొఫెసర్ స్టెఫానో మార్గరిటోరా తెలిపారు. సర్జరీకి ముందు అనుమానించిన ఫలితాలతో ఇది సరిపోలిందని పేర్కొన్నారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తయింద‌న్నారు. ఆపరేషన్ తర్వాత పోప్ సాధారణ స్థితిలోకి వచ్చారని, ప్రస్తుతం ఆయన ద‌వాఖాన‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. పోప్‌ దాదాపు వారం పాటు ఆసుపత్రిలోనే ఉంటార‌ని, ఈ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 20 వ‌ర‌కు ఆయన పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాల‌ను ర‌ద్దు చేశారు.

1955లో చికాగోలో (Chicago) రాబర్ట్ ప్రివోస్ట్‌గా జన్మించిన పోప్ లియో.. 2025 మే నెల‌లో ప్ర‌పంచ కార్డిన‌ల్స్‌తో పోప్‌గా ఎన్నిక‌య్యారు. దీంతో ఆయ‌న అతి చిన్న వ‌య‌స్సులోనే పోప్‌గా ఎన్నికోబ‌డిన వ్య‌క్తిగా రికార్డుల్లో నిలిచారు. అంత‌కుముందు ఆయ‌న పెరూలో మిషనరీగా, బిషప్‌గా దశాబ్దాల సేవలు అందించారు.

Advertisement
Advertisement