Vijay Deverakonda | క్రికెటర్‌గా మారిన విజయ్ దేవరకొండ – డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ – సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ క్రికెటర్‌గా మారాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఏడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన సెంచరీ స్కోరు బోర్డు ఫొటోను విజయ్ అభిమానులతో పంచుకున్నాడు.
Entertainment | Published On Jun 15, 2026, 4.42 pm IST
Vijay Deverakonda | రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రికెటర్‌గా మారాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే ఏకంగా సెంచరీ సాధించాడు. ఈ ఫొటోను సోషల్ మీడియా ద్వారా విజయ్ అభిమానులతో పంచుకున్నాడు.
సిక్సర్లు...ఫోర్లు...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న తెలంగాణ టీ20 లీగ్‌లో విజయ్ దేవరకొండ ఆడాడు. తొలి మ్యాచ్‌లో 148 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. తన వ్యక్తిగత స్కోరు బోర్డ్ ఫొటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో తన పేరుతోనే ఉన్న జెర్సీ ధరించి వెనక్కి తిరిగి విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తున్నాడు. "క్రికెటర్ కావాలని చాలా మంది యువకులు అనుకుంటారు. ముఖ్యంగా 90 దశకంలో పుట్టిన అబ్బాయిలకు అదొక పెద్ద డ్రీమ్. ఆ కలను నేడు నేను నిజం చేసుకున్నా" అంటూ ఈ ఫొటోను ఉద్దేశించి విజయ్ కామెంట్స్ పెట్టాడు. అతడి ట్వీట్ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ ఆడాలి...
విజయ్‌లోనూ మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. సీసీఎల్, ఐపీఎల్ లాంటి లీగ్స్‌లో ఆడాలని సలహాలు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం షూటింగ్‌లోని సీన్ కావచ్చునంటూ కామెంట్లు పెడుతోన్నారు.
మూడు సినిమాలు...
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తెలుగులో మూడు సినిమాలు చేస్తోన్నాడు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న రణబాలి సెప్టెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ఇది. దిల్‌రాజు బ్యానర్‌లో చేస్తోన్న రౌడీ జనార్ధన డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది. మాస్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రవి కిరణ్ కోలా డైరెక్టర్. ఇటీవలే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ మైథాలజీ మూవీకి విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
Everyboy once wanted to be a cricketer ❤️
Especially us 90s boys.
Getting to Live it up now. pic.twitter.com/WuxeOZKUq7— Vijay Deverakonda (@TheDeverakonda) June 15, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





