Preethi Asrani | ప్రీతి అస్రాని టాలీవుడ్ ఎంట్రీపై చర్చ..!
Preethi Asrani | తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రీతి అస్రాని. తాజాగా ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిభ, సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంటున్న ప్రీతికి సంబంధించి భవిష్యత్ కెరీర్ ప్రణాళికలపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె పూర్తిస్థాయిలో టాలీవుడ్ ఎంట్రీపై చర్చ సాగుతోంది.
Entertainment | Published On Jun 13, 2026, 11.00 pm IST
Preethi Asrani | తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రీతి అస్రాని. తాజాగా ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిభ, సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంటున్న ప్రీతికి సంబంధించి భవిష్యత్ కెరీర్ ప్రణాళికలపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె పూర్తిస్థాయిలో టాలీవుడ్ ఎంట్రీపై చర్చ సాగుతోంది. ప్రీతి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడాన్ని వ్యతిరేకించడం లేదని, తనను ప్రత్యేకతను నిలబెట్టుకునే పాత్రలను ఎంచుకోవాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సహజమైన అందం, సరళమైన వ్యక్తిత్వం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యమే ఆమె బలమని పేర్కొంటున్నారు. టాలీవుడ్‌లో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో నటన కంటే గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు వచ్చే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రతిభతో గుర్తింపు పొందిన పలువురు హీరోయిన్లు.. ఆ తర్వాత గ్లామర్ పత్రలకే పరిమితమైన సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత సినీ పరిశ్రమలో పరిస్థితులు మారాయని మరికొందరు పేర్కొంటున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు కథా ప్రాధాన్యం ఉన్న, ఓటీటీ కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని గుర్తు చేస్తున్నారు. దీంతో నటీమణులకు విభిన్న తరహా పాత్రల్లో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పెరిగాయని వాదిస్తున్నారు. కంటెంట్ బేస్డ్ మూవీలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రీతి అస్రాని వంటి యువ నటీమణులకు మంచి అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సరైన కథలు, పాత్రలను ఎంచుకుంటే భాషతో సంబంధం లేకుండా కెరీర్‌ను మరింత విస్తరించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీతి అస్రాని భవిష్యత్ ప్రాజెక్టులు, కెరీర్ దిశపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఆమె టాలీవుడ్‌లో అవకాశాలను స్వీకరించినా, ఇతర భాషల్లో కొనసాగినా నటిగా తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవాలన్నదే అభిమానుల అభిలాషగా కనిపిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!
- ●KTR | చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి

Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?




