Shakib Al Hasan | బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..
Shakib Al Hasan | బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆవామీ లీగ్ మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) ఇంటిపై పెట్రోబాంబు దాడి జరిగింది.
International | Published On Aug 6, 2026, 8.12 am IST
Shakib Al Hasan | త్రినేత్ర.న్యూస్: బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆవామీ లీగ్ మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) ఇంటిపై పెట్రోబాంబు దాడి జరిగింది. బుధవారం రాత్రి సుమారు 8.45 గంటల సమయంలో మగురా పట్టణంలోని కేశబ్‌మోర్ ప్రాంతంలో ఉన్న షకీబ్ పూర్వీకుల ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోల్ బాంబులు (Petrol Bomb Attack) విసిరి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ వేదికగా వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అందులో షకీబ్ అల్ హసన్ కూడా పాల్గొన్నారు. అనంతరం తన ఇంటిపై ఈ దాడి జరిగడం గమనార్హం.
రాత్రి 8.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని మగురా (Magura) సదర్ పోలీసు స్టేషన్ అధికారి ఎండీ అబ్దుల్లా అల్ మమున్ తెలిపారు. కొంతమంది దుండగులు షకీబ్ ఇంటికపై ఇటుకలు విసిరారని, కిటీకీలను ధ్వంసం చేశారని చెప్పారు. అనంతరం ఇంటికి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారన్నారు. దీంతో షకీబ్ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని వెల్లడించారు. దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు.
ఇండ్లను తగలబెడుతున్నారు..
ఈ ఘటనపై అవామీ లీగ్ స్పందించింది. అవామీ లీగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు (Press Conference) హాజరైనందుకు ఇండ్లను తగలబెడుతున్నారని ఆరోపించింది. బంగ్లాదేశ్‌ను నయా ఫాసిజం చుట్టుముడుతున్నదని విమర్శించింది. కాగా, బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్‌లా మారుతున్నదని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. తాను డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. తన తిరుగు ప్రయాణం అధికారం కోసం కాదని, బంగ్లాదేశ్‌ను తిరిగి అభివృద్ధి, లౌకికవాదం, అభివృద్ధి మార్గంలోకి తీసుకురావడానికే వెళ్లానని చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంకా వీడ్కోలు పలకని షకీబ్ అల్ హసన్.. 2024 చివరి నుంచి బంగ్లా తరపున క్రికెట్ ఆడలేదు. అన్ని ఫార్మాట్లలో పూర్తిస్థాయి సిరీస్ ఆడిన తర్వాతే క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, 2024 ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో మగురా-1 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ (Awami League) అభ్యర్థిగా పోటీచేసిన షకీబ్.. ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి హసన్ బంగ్లాదేశ్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. రాజకీయ అశాంతి సమయంలో జరిగిన ఓ హత్య కేసులో నమోదైన ఎఫ్ఐఆర్‌లో మొత్తం 147 మందితోపాటు షకీబ్ పేరు కూడా ఉంది.
సంబంధిత వార్తలు

Sheikh Hasina | డిసెంబర్‌లో స్వదేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హసీనా కీలక ప్రకటన
జులై 10, 2026

Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు
జూన్ 29, 2026

Sheikh Hasina | ఉరిశిక్ష వేసినా భయపడను.. ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా: షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్
- ●Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
- ●Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం
- ●Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ పై అదిరిపోయే డీల్.. రూ.57 వేల వరకు ఆదా..
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం

Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు



