Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
Nifty 50 | భారత స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. మంగళవారం నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధిక స్థాయిలో కొనసాగడం, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్‌లో ఆందోళనను పెంచాయి.
Nifty 50 | భారత స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. మంగళవారం నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధిక స్థాయిలో కొనసాగడం, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్‌లో ఆందోళనను పెంచాయి. మంగళవారం ఇంట్రాడేలో నిఫ్టీ 50 గరిష్ఠంగా 0.92 శాతం పడిపోయి 22,569.65 స్థాయికి చేరింది. ఆరు నెలల వ్యవధిలో నిఫ్టీ 1.06 శాతం క్షీణించింది. గత నెలలో సూచీ 6.57 శాతం, గత వారంలో 3.18 శాతం నష్టపోయింది. 2026లో ఇప్పటివరకు నిఫ్టీ 13.53 శాతం దిగజారింది. ఈ ఏడాది నిఫ్టీ గరిష్ఠ స్థాయి 26,328.55గా ఉంది. సోమవారం కూడా మార్కెట్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. నిఫ్టీ 1.6 శాతం పతనమై 22,780.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఏకంగా 1,124 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది. రెండు బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు ఆరు నెలల కనిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి.
పెరుగుతున్న చమురు ధరలే కారణం..
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రాంతీయ ఇంధన సరఫరాలపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సుమారు 106 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు ధరలు పెరగడం భారత్ దిగుమతి బిల్లుపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉండడంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలగే రూపాయి విలువ కూడా డాలర్‌తో పోలిస్తే 96 మార్కును దాటింది. ప్రస్తుతం ఒక డాలర్‌కు సుమారు రూ.96.10 వద్ద రూపాయి ట్రేడవుతోంది. పెరిగిన చమురు ధరలకు తోడు రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ తెలిపారు. ఇది విస్తృత ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నిఫ్టీ50 కీలక స్థాయిలు ఇవే..
సాంకేతికంగా నిఫ్టీకి 22,500 స్థాయి కీలక మద్దతు ప్రాంతంగా మారిందని పొన్ముడి తెలిపారు. ఈ స్థాయి కంటే నిఫ్టీ నిర్ణయాత్మకంగా దిగువకు జారితే అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని, అప్పుడు 22,300 నుంచి 22,000 స్థాయిల వరకు సూచీ పడిపోయే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు 22,800 స్థాయి తక్షణ నిరోధంగా ఉంది. నిఫ్టీ ఈ స్థాయి పైన స్థిరంగా కదలగలిగితే 23,000 మార్క్ వైపు పుంజుకునే అవకాశం ఉంటుందని, అయితే ఎగువ స్థాయిల వద్ద మళ్లీ అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం నిఫ్టీ సాంకేతిక పరిస్థితి బలహీనంగా ఉందని, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) 20ల మధ్యలో ఉండడం వల్ల మార్కెట్ తీవ్రంగా ఓవర్‌సోల్డ్ పరిస్థితిలో ఉన్నట్లు సంకేతాలు ఇస్తోందని తెలిపారు. అదే సమయంలో మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ (ఎంఏసీడీ) కూడా తీవ్రంగా ప్రతికూలంగా ఉండడం వల్ల దిగువ దిశలో మొమెంటం కొనసాగుతున్నట్లు సూచిస్తోందని తెలిపారు. సమీప కాలంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ల కదలికను నిర్ణయించడంలో ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పొన్ముడి తెలిపారు. ఈ రెండు అంశాల్లో వచ్చే మార్పులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై, మార్కెట్ తదుపరి దిశపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్
- ●Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు
- ●Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం
- ●Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రొ పై అదిరిపోయే డీల్.. రూ.57 వేల వరకు ఆదా..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Vivo India | దేశవ్యాప్తంగా 10 మంది టీచర్లకు వివో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్

Rahul Gandhi | ఒత్తిడి తెస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయ్.. రండి వీధుల్లోకి వచ్చి మీ గళాన్ని వినిపించండి.. యువతకు రాహుల్ పిలుపు

Chamala Kirankumar Reddy | రేపు సిరిసిల్లలో కేటీఆర్‌కు సినిమా చూపించబోతున్నం

Paradise Movie | మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ప్యారడైజ్ చిత్రబృందం ప్రత్యేక పూజలు






