త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మోదీజీ నాకు న్యాయం చేయండి.. పాక్ యువతి ఆవేదన

J

International | Published On Dec 7, 2025, 4.37 pm IST

మోదీజీ నాకు న్యాయం చేయండి.. పాక్ యువతి ఆవేదన
Advertisement

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి.. మన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఆ యువతి ప్రధాని నరేంద్ర మోదీకి మొర పెట్టుకుంది. ఇంతకీ ఎందుకు అంటారా? పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.

పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన నికితా నాగ్‌దేవ్‌.. విక్రమ్ నాగ్‌దేవ్ అనే వ్యక్తిని హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. విక్రమ్‌ది కూడా పాకిస్థానే కానీ.. అతడు భారత్‌లోని ఇండోర్‌లో లాంగ్ టర్మ్ వీసాతో నివసిస్తున్నాడు. పెళ్లి అయిన నెల రోజులకే విక్రమ్.. తన భార్యను తీసుకొని ఫిబ్రవరి 26న భారత్‌కు తీసుకొచ్చాడు.

ఆ తర్వాత జులై 2020లో వీసా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అట్టారి బోర్డర్ వద్దకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి తనను మాత్రం పాకిస్థాన్ పంపించేశాడు. ఆ తర్వాత ఆమెను భారత్‌కు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.  కట్ చేస్తే ఇప్పుడు ఢిల్లీకి చెందిన ఓ యువతిని రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. అంటూ నికిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ప్రధానికి విజ్ఞప్తి

కరాచీ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో నికిత మాట్లాడుతూ.. ఈరోజు నాకు న్యాయం జరగకపోతే న్యాయవ్యవస్థ మీదనే మహిళలకు నమ్మకం పోతుంది. భారత్‌లో ప్రతి మహిళలకు న్యాయం జరిగే అర్హత ఉంది. దయచేసి నాకు హెల్ప్ చేయడం.. అంటూ ఆ యువతి మోదీని వేడుకుంది.

పెళ్లి అయిన కొత్తలోనే విక్రమ్‌కు మరో యువతితో అక్రమ సంబంధం ఉన్నట్లు తనకు తెలిసిందని.. ఈ విషయాన్ని విక్రమ్ కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని నికిత వాపోయింది.

నికిత వీడియోపై స్పందించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సింధీ పంచ్ మీడియేషన్ సెంటర్ విచారణ చేపట్టింది. కానీ.. వీళ్లిద్దరూ భారత పౌరులు కానందున.. ఈ కేసు పాకిస్థాన్ పరిధిలోకి వస్తుందని, అందువల్ల విక్రమ్‌ను పాకిస్థాన్‌కు తిరిగి పంపాలని సిఫారసు చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement