Pakistan Journalist Hamid Mir | మమ్మల్ని ట్రంప్ టిష్యూ పేపర్‌లా వాడుకున్నాడు.. షరీఫ్-మునీర్ ద్వయంపై పాక్ జర్నలిస్టు ఆగ్రహం..
Pakistan Journalist Hamid Mir | అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌పై వీసా ఫ్రీజ్ విధించడంపై పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌ను అవమానపరిచిందని, ట్రంప్ రాజకీయ వ్యూహాన్ని తమ ప్రభుత్వం పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుందని ఆయన మండిపడ్డారు.
International | Published On Jan 19, 2026, 8.26 am IST
Pakistan Journalist Hamid Mir | అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌పై వీసా ఫ్రీజ్ విధించడంపై పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్ హమీద్ మీర్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్‌ను అవమానపరిచిందని, ట్రంప్ రాజకీయ వ్యూహాన్ని తమ ప్రభుత్వం పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుందని ఆయన మండిపడ్డారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇద్దరూ రెండుసార్లు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారని గుర్తు చేసిన మీర్, దానికి ప్రతిఫలంగా పాకిస్తాన్‌కు దక్కింది చేతులు కలపడం కాదు, దౌత్యపరమైన చెంపదెబ్బ అంటూ ఎద్దేవా చేశారు.
భారత్ ట్రంప్‌ను ఎప్పుడూ నామినేట్ చేయలేదు. అయినా భారత్ వీసా నిషేధ జాబితాలోకి వెళ్లలేదు. కానీ మేము మాత్రం అక్కడ నిలబడ్డాం.. అని హమీద్ మీర్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్ ప్రభుత్వం దౌత్యపరమైన విజయాన్ని సాధించాల్సిన చోట ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యే పని చేసిందని మీర్ విమర్శించారు. ట్రంప్ తమను టిష్యూ పేపర్‌లా వాడుకుని, అవసరం తీరాక పక్కకు విసిరేసినట్టుగా పరిస్థితి మారింది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా జనవరి 21వ తేదీ నుంచి అమలులోకి వచ్చే వీసా ఆంక్షలతో పాకిస్తాన్ పౌరుల దీర్ఘకాలిక వలస వీసాల ప్రక్రియను అమెరికా నిలిపివేయనుంది.
ఇక ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం అమెరికా ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్ సహా మొత్తం 75 దేశాలకు సంబంధించిన వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టంగా వెల్లడించకపోయినా, ఇది జనవరి 21వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సోమాలియా, రష్యా, ఇరాన్, అఫ్ఘానిస్తాన్, బ్రెజిల్, నైజీరియా, థాయ్‌లాండ్, అల్బేనియా, అల్జీరియా, ఆర్మేనియా, అజర్‌బైజాన్, భూటాన్, బోస్నియా, కాంబోడియా, కొలంబియా, క్యూబా, ఈజిప్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తదితర దేశాలు కూడా ఉన్నాయి.
Trump used Pakistan like a tissue paper for Nobel nomination; wiped his desired parts, and dumped Pak with Visa ban.
But Pai-jan, we were friends. How could you do this to us, asks propagandist @hamidmirpakpic.twitter.com/KjDMAvEDoa
— Pakistan Untold (@pakistan_untold) January 17, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






