త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Price | సిలిండ‌ర్ ధ‌ర రూ.5వేలు.. పాకిస్తాన్‌లో దారుణంగా ప‌రిస్థితులు..!

LPG Price | దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆసియాలో పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం అక్కడి మార్కెట్‌పై తీవ్రంగా ప‌డుతోంది. ముఖ్యంగా ఎల్‌పీజీ ధరలు భారీగా పెరిగాయి.

P

International | Published On Mar 28, 2026, 9.30 pm IST

LPG Price | సిలిండ‌ర్ ధ‌ర రూ.5వేలు.. పాకిస్తాన్‌లో దారుణంగా ప‌రిస్థితులు..!
Advertisement

LPG Price | దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆసియాలో పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం అక్కడి మార్కెట్‌పై తీవ్రంగా ప‌డుతోంది. ముఖ్యంగా ఎల్‌పీజీ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 11.67 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.3,150 నుంచి దాదాపు రూ.5,135 (పాక్ క‌రెన్సీ)లో వరకు పెరిగిందని సమాచారం. పంజాబ్ ప్రాంతంలో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా కనిపిస్తోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఎల్‌పీజీపై ఆధారపడే ఆటోలు, బస్సులు, మినీబస్సుల ఛార్జీలు పెరగడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తక్కువ, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం ప‌డుతోంది.

ఇదే సమయంలో ఈద్, నౌరోజ్ పండుగల కారణంగా ఇరాన్ నుంచి గ్యాస్ సరఫరా తగ్గిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారింది. ఇక దేశంలో ఇంధన నిల్వలు కూడా ఆందోళన కలిగించే స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు చూస్తే, ముడి చమురు కేవలం 11 రోజులకు మాత్రమే సరిపోతుంది. అలాగే పెట్రోల్ 27 రోజులు, డీజిల్ 21 రోజులు, ఎల్‌పీజీ మాత్రం కేవలం 9 రోజులకు సరిపడే స్థాయిలోనే ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ తన అవసరాల్లో పెద్ద భాగాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుండడంతో, అక్కడి పరిస్థితులు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. సరఫరా అంతరాయం కొనసాగితే ఏప్రిల్ మధ్య నాటికి గ్యాస్ కొరత మరింత తీవ్రమయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలో రావాల్సిన ఎల్ఎన్‌జీ కార్గోలలో చాలా వరకు రాకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement