US troops | ఇరాన్‌పై భూతల దాడులకు సిద్ధం?.. పశ్చిమాసియాకు చేరుకున్న అమెరికా దళాలు..
US troops | ఇరాన్‌లో (Iran) భూతల దాడులకు అమెరికా (United States) సన్నద్ధమవుతున్నది. ఒకవైపు చర్చలు అంటూనే పశ్చిమాసియాలో (Middle East) సైన్యాన్ని (US troops) మోహరిస్తున్నది. ఇకప్పటికే వెయ్యి మందికిపైగా మెరైన్లను అక్కడికి తరలించిన పెంటగాన్.. తాజాగా 2500 మంది మెరైన్లతో అత్యాధునిక యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి (USS Tripoli) పశ్చిమాసియాకు చేరుకుంది.
International | Published On Mar 29, 2026, 9.14 am IST
US troops | త్రినేత్ర.న్యూస్: ఇరాన్‌లో (Iran) భూతల దాడులకు అమెరికా (United States) సన్నద్ధమవుతున్నది. ఒకవైపు చర్చలు అంటూనే పశ్చిమాసియాలో (Middle East) సైన్యాన్ని (US troops) మోహరిస్తున్నది. ఇకప్పటికే వెయ్యి మందికిపైగా మెరైన్లను అక్కడికి తరలించిన పెంటగాన్.. తాజాగా 2500 మంది మెరైన్లతో అత్యాధునిక యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి (USS Tripoli) పశ్చిమాసియాకు చేరుకుంది. దీంతో ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3,500 దాటింది. ఈమేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ (USCC) ఎక్స్ ద్వారా వెల్లడించింది. అయితే క్షేత్రస్థాయిలో బలగాల మోహరింపును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదిస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా, గత 20 ఏండ్లలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నెల రోజులు గడుస్తున్నది. అయినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం చల్లారడం లేదు. మధ్య ప్రాచ్యానికి అమెరికా భారీగా సైనికులను తరలిస్తుండటంతో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులు అక్కడ ఉండగా, తాజాగా 3500 మంది బలగాలను అక్కడికి తరలించింది.

జపాన్ తీరంలోని తైవాన్ సమీపంలో ఉన్న ఉభయచర యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలిని (USS Tripoli) అత్యవసరంగా పశ్చిమాసియా కు తరలించాలని రెండువారాల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై ఎఫ్-35 ఫైటర్ జెట్‌లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. దీంతోపాటు యూఎస్‌ఎస్ బాక్సర్‌తో పాటు శాన్‌డియోగా నుంచి వచ్చిన ఇతర యుద్ధ నౌకలు కూడా మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్నాయి. వీటిలో మెరైన్ సైనికులతోపాటు రవాణా విమానాలు, స్ట్రైక్ ఫైటర్ జెట్లు, యుద్ధ సామాగ్రి ఉన్నాయి. దీంతో ఇరాన్‌లో యూఎస్ ఏ క్షణాన భూతల దాడులకు దిగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి.

వెల్‌కమ్ టూ హెల్.. టెహ్రాన్ టైమ్స్ హెచ్చరిక
అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇరాన్.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసిరింది. తమ గడ్డపైకి అమెరికా సైనికులు వస్తే, శవపేటికల్లోనే వెనక్కి వెళ్తారని తేల్చి చెప్పింది. మిడిల్ ఈస్ట్‌కు అదనంగా 10,000 మంది సైనికులను పంపాలని అమెరికా భావిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ ఈ స్థాయిలో స్పందించింది. ఇరాన్‌కు చెందిన ఇంగ్లీష్ దినపత్రిక 'టెహ్రాన్ టైమ్స్' శుక్రవారం తన ఫ్రంట్ పేజీలో "వెల్‌కమ్ టు హెల్" (నరకానికి స్వాగతం) అనే శీర్షికతో అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ గడ్డపై కాలుమోపే ఏ అమెరికా సైనికుడైనా సరే.. 'కేవలం శవపేటికలోనే' వెనక్కి వెళ్తాడని అందులో రాసుకొచ్చింది.
సంబంధిత వార్తలు

Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం
జులై 27, 2026

DGMA | హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
జులై 16, 2026

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
జులై 15, 2026
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
- ●ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
- ●Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం
- ●Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..

Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు

Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..



