త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ స‌భ్యుల ఎదురుచూపులు

Hyderabad girl goes missing in Nepal floods | ఇటీవ‌ల అక‌స్మాత్తుగా సంభ‌వించిన నేపాల్‌ వరదల్లో హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. సుహాసిని ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంద‌ని.. ఈనెల 19న హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

S

News | Published On Aug 27, 2026, 3.38 pm IST

Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ స‌భ్యుల ఎదురుచూపులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌ల అక‌స్మాత్తుగా సంభ‌వించిన నేపాల్‌ వరదల్లో హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. కందిమ‌ల్ల‌ సుహాసిని రెడ్డి ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంద‌ని.. ఈనెల 19న హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. అనంతరం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన స్నేహితురాలితో కలిసి మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లింద‌ని వివ‌రించారు. గ‌త మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తీవ్ర ఆందోళనకు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికీ ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు.

సుహాసిని తండ్రి కందిమ‌ల్ల‌ మ‌హేంద‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప‌లు వివ‌రాల‌ను పంచుకున్నారు. హైద‌రాబాద్ నుంచి ఈనెల 23న (ఆదివారం) 11 గంట‌లకు ఫ్లైట్ ఉండే. 8 గంట‌ల‌కు క్యాబ్ బుక్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లింది. ఢిల్లీ నుంచి ఖాట్మాండు చేరింది. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత మాతో మాట్లాడింది. ఆదివారం, సోమ‌వారం కూడా మాతో మాట్లాడింది. మంగ‌ళ‌వారం సాయంత్ర 7.30 నిమిషాల వ‌ర‌కు కూడా మాతో ట‌చ్‌లో ఉంది. ఇక అప్ప‌ట్నుంచి క‌నెక్ష‌న్ లేదు.

చైనా వీసా కోసం ఇమ్మిగ్రేష‌న్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని చెప్పింది. సిగ్న‌ల్స్ ఉంట‌యే లేవో.. రేపు మాట్లాడుత‌నో లేనో అని మాతో అన్న‌ది. ఆస్ట్రేలియా నుంచి ఫ్రెండ్‌తో క‌లిసి వ‌చ్చింది. ఖాట్మండ్‌లో టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మొత్తం 29 మంది యాత్రకు బయలుదేరారు. ఆ తర్వాత వరదల సమాచారం తెలియడంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. మా కొడుకు, అల్లుడు న్యూజిలాండ్‌లో ఉన్నారు. వాళ్లే ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అని మ‌హేంద‌ర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement