త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్‌..

Stock Markets | అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలకు స్పందించిన పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగడంతో ప్రారంభమైన నిమిషంలోనే సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్లు పతనమైంది. మరోవైపు నిఫ్టీ కూడా సుమారు 200 పాయింట్లు పడిపోయింది.

S

Business | Published On Sep 2, 2026, 9.53 am IST

Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్‌..
Advertisement

Stock Markets | అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలకు స్పందించిన పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగడంతో ప్రారంభమైన నిమిషంలోనే సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్లు పతనమైంది. మరోవైపు నిఫ్టీ కూడా సుమారు 200 పాయింట్లు పడిపోయింది. మార్కెట్‌ ప్రారంభానికి ముందు జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 540 పాయింట్లకు పైగా నష్టపోయి 76,397.24 వద్ద ఉండగా, నిఫ్టీ 203 పాయింట్లకు పైగా పడిపోయి 23,852.05 వద్ద నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో సన్‌ ఫార్మా మాత్రమే లాభాల్లో కనిపించింది. మిగిలిన ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అమెరికా, ఇరాన్‌ మధ్య రాత్రికి రాత్రే పరస్పర దాడులు జరగడంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత ముదిరింది. అమెరికా దళాలు ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించగా, ఇరాన్‌ కూడా ప్రతిస్పందించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగి, పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర దాదాపు 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 96.6 డాలర్లకు చేరుకుంది. ఇది దాదాపు ఆరు వారాల గరిష్ఠ స్థాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. అదే సమయంలో ప్రపంచ బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో అమెరికా సమీప కాలంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడ్డాయి. అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తక్కువ ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌రోమారు ప‌త‌న‌మైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 94.96 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెష‌న్‌లో 0.02 శాతం మేర న‌ష్ట‌పోయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement