Kapra Lake | కొనసాగుతున్న కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు.. వినాయక నిమజ్జనంపై ఆంక్షలు..
Kapra Lake | కాప్రా చెరువు (Kapra Lake) పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. విదేశీ పక్షులకు ఆవాసంగా ఉన్న ఈ చెరువు సుమారు 113 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగరంలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా (HYDRAA) ఈ చెరువును కూడా పునరుద్ధరిస్తున్నది.
Kapra Lake | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉన్న కాప్రా చెరువు (Kapra Lake) పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి. విదేశీ పక్షులకు ఆవాసంగా ఉన్న ఈ చెరువు సుమారు 113 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగరంలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా హైడ్రా (HYDRAA) ఈ చెరువును కూడా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కాప్రా చెరువులో చేయడానికి అనుమతి లేదని హైడ్రా స్పష్టం చేసింది. ఈ చెరువు సాధారణ నీటి వనరు మాత్రమే కాదని, నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని పేర్కొంది. వినాయక నిమజ్జనాలకు ప్రత్యామ్నాలు చేసుకోవాలని సూచించింది. చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను ఉపయోగించుకోవాలని సూచించింది.
రూ.35 కోట్లతో కాప్రా చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తున్నది. చెరువు పునరుజ్జీవనం, సుందరీకరణ, వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, మౌలికసదుపాయాల కల్పన, జీవవైవిధ్యం, పక్షుల ఆవాసం వంటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పనులు చేపట్టారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే కాప్రా చెరువు నగరానికి మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సెప్టెంబర్ 4, 2026

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
సెప్టెంబర్ 4, 2026

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



