Russia Ukraine War | రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. నాలుగేండ్లలో 20 లక్షల మంది మృతి
Russia Ukraine War | రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి (Russia Ukraine War) నాలుగేండ్లు కావొస్తున్నది. 2022, ఫిబ్రవరి 22న ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) దురాక్రమణ మొదలుపెట్టింది. అంతూపొంతూ లేకుండా సాగుతున్న ఈ యుద్ధం రెండు దేశాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.
International | Published On Jan 29, 2026, 8.55 am IST
త్రినేత్ర.న్యూస్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి (Russia Ukraine War) నాలుగేండ్లు కావొస్తున్నది. 2022, ఫిబ్రవరి 22న ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) దురాక్రమణ మొదలుపెట్టింది. అంతూపొంతూ లేకుండా సాగుతున్న ఈ యుద్ధం రెండు దేశాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. లక్షలాది మంది మరణించగా, కోట్లలో ఆస్తి నష్టం కలిగింది. భీకర గగనతల, భూతల దాడులతో సాధారణ ప్రజల కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అత్యాధునిక ఆయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడుతుండటంతో ఇరు దేశాలు ఆర్థికంగా ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.

ఈ నాలుగేండ్లలో రెండు దేశాల్లో మొత్తంగా 20 లక్షల మంది చనిపోయారని ఓ అధ్యయనంలో తేలింది. ఉక్రెయిన్ ప్రతిదాడిలో రష్యాలో కనీసం 12 లక్షల మంది మృతిచెందారని సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) సంస్థ తన నివేదికలో వెల్లడించింది. చనిపోయిన వారిలో 3 లక్షల 25 వేల మంది సైనికులు ఉన్నారు. మరో 4 లక్షల 15 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఈ నాలుగు సంవత్సరాలలో సరాసరి నెలకు సుమారు 35 వేల మంది క్షతగాత్రులయ్యారు.

ఇక రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తన బలగాల్లో లక్షా 40 వేల మందిని కోల్పోయింది. తీవ్రంగా గాయపడటం, జాడ తెలీకుండా పోవడం, శత్రుదేశ సైన్యానికి చిక్కి బందీలుగా రష్యాకు బలవంతంగా తరలిపోయిన కేటగిరీలో మరో 6 లక్షల మంది ఉన్నారు. కొద్దిపాటి భూభాగం, విలువైన ఖనిజ నిల్వలపై ఆధిపత్యం పొందే క్రమంలో రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటున్నదని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వంటి అగ్రరాజ్యం ఇంతటి ప్రాణనష్టాన్ని చవిచూడడం చరిత్రలో ఇదే తొలిసారని సీఎస్ఐఎస్ తన నివేదికలో వెల్లడించింది. పేర్కొంది.

కాగా, రష్యా, ఉక్రెయిన్ అధునాతన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా మృత్యువు విలయతాండవం చేస్తోంది. వేలాది మంది అమాయక ప్రజలు అసువులు బాశారు. ఇరువైపుల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. ఈ యుద్ధంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది.
సంబంధిత వార్తలు

Indian Worker Killed in Russia | రష్యాపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి: భారతీయ కార్మికుడు మృతి, ముగ్గురికి గాయాలు
మే 17, 2026

Vladimir Putin | డ్రోన్ దాడుల భయం.. కొన్ని వారాలుగా బంకర్లలో దాక్కున్న పుతిన్..!
మే 8, 2026

Russia Electro-L Satellite | రష్యన్ శాటిలైట్ కంటికి చిక్కిన భారత్.. ఆకుపచ్చని మెరుపుతో అద్భుతమైన దృశ్యం!
మే 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



