Artemis 2 | భూమికి చేరిన ఆర్టెమిస్ 2..
Artemis 2 | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చంద్రుడిపైకి పంపిన ఆర్టెమిస్-2 (Artemis 2) తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరింది. శనివారం ఉదయం 5.38 గంటలకు (భారత కాలమానం ప్రకారం) కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాండియాగో తీరంలో ఒరాయన్ క్యాప్సుల్ (Orion spacecraft) విజయవంతంగా ల్యాండ్ (Splashdown) అయింది.
International | Published On Apr 11, 2026, 6.33 am IST
Artemis 2 | త్రినేత్ర.న్యూస్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చంద్రుడిపైకి పంపిన ఆర్టెమిస్-2 (Artemis 2) తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరింది. శనివారం ఉదయం 5.38 గంటలకు (భారత కాలమానం ప్రకారం) కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాండియాగో తీరంలో ఒరాయన్ క్యాప్సుల్ (Orion spacecraft) విజయవంతంగా ల్యాండ్ (Splashdown) అయింది. ఒరాయన్ సురక్షితంగా దిగడంతో పది రోజులపాటు సాగిన అంతరిక్ష ప్రయాణం ముగిసింది. సమీపంలో లంగరేసిన అమెరికా యుద్ధనౌక యూఎస్ఎస్ జాన్ పీ మూర్తా సిబ్బంది దీన్ని వెలికితీశారు. అందులో నుంచి నలుగురు వ్యోమగాములు, రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్‌ను బయటకు తీసుకువచ్చారు. ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రతో నాసా చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది.

యాత్రలోభాగంగా నలుగురు వ్యోమగాములు భూమి నుంచి మానవులెవ్వరూ వెళ్లనంత దూరానికి (4,06,778 కిలోమీటర్లు) వెళ్లారు. భూమి నుంచి 2,48,000 మైళ్లకు మించి ప్రయాణించి చంద్రుడి అవతలి వైపున ఉన్న అద్భుత దృశ్యాలను క్యాప్చర్ చేశారు. అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వీక్షించారు. యాత్రలో అత్యంత దూరపు పాయింట్‌కు చేరినప్పుడు భూమికి, స్పేస్ క్రాఫ్ట్‌కు మధ్య దూరం 2,52,756 మైళ్లుగా నమోదైంది. దీంతో గతంలో అపోలో-13 మిషన్ (Apollo) నెలకొల్పిన రికార్డును ఇది అధిగమించింది.

LIVE: They are coming home.
Watch as the Artemis II crew returns to Earth, splashing down at around 8:07pm ET (0007 UTC April 11). https://t.co/n3vZE2rcFv
— NASA (@NASA) April 10, 2026
The crew module on Orion has separated from its service module. After traveling around the Moon, seeing its far side, and experiencing a solar eclipse, the Artemis II astronauts are on the last leg of their trip home. pic.twitter.com/j9u5j1Noi9
— NASA (@NASA) April 10, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






