NASA | నింగిలోకి దూసుకెళ్లిన ఆర్టెమిస్ -2 రాకెట్.. వీడియో
NASA | త్రినేత్ర.న్యూస్: అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 50 ఏండ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవులను పంపేందుకు ఉద్దేశించిన ‘ఆర్టెమిస్-2’ను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించింది.
International | Published On Apr 2, 2026, 7.43 am IST
NASA | త్రినేత్ర.న్యూస్: అంతరిక్ష ప్రయోగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 50 ఏండ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవులను పంపేందుకు ఉద్దేశించిన ‘ఆర్టెమిస్-2’ను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించింది. బుధవారం సాయంత్రం 6.35 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) నలుగురు వ్యోమగాములతో కూడిన ‘ఓరియన్’ రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జాబిల్లి దిశగా నింగిలోకి దూసుకెళ్లింది.

ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా వ్యోమగాముల సహితంగా అమెరికా జరుపుతున్న మొదటి ప్రయోగం ఆర్టెమిస్ – IIనే కావడం విశేషం. చంద్రుడి వద్దకు తొలిసారిగా ఓ మహిళ, ఓ నల్లజాతీయుడు, ఓ కెనడియన్ ఇందులో వెళ్తున్నారు. మిషనల్ భాగంగా ఓరియన్ రాకెట్ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దాన్ని చుట్టి రానుంది. నలుగురు వ్యోమగాములు పది రోజులపాటు రాకెట్‌లోనే ప్రయాణిస్తారు. చంద్రుడి కక్ష్యపై పరిశోధనలు జరిపి తిరిగి భూమిపైకి వస్తారు. వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యేలా నాసా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో జాబిల్లిపైకి మానవులను పంపించే మార్గం సుగమం అవుతుంది.
The hatch is now closed.
The Artemis II astronauts are now strapped into their seats and ready for launch. pic.twitter.com/NWSjgklep9
— NASA (@NASA) April 1, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






