త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం చేశారు.

J

International | Published On Jul 11, 2026, 6.20 pm IST

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!

సంక్షిప్త సారాంశం

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తన తండ్రి అలీ ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్‌ నగరంలో ముగిశాయి, అయితే మొజ్తబా ఇంకా పబ్లిక్ లోకి రాలేదు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని, అయితే వారి కోరిక మేరకు చర్చలకు తాము సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Advertisement
  • అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్

Mojtaba Khamenei Revenge | త్రినేత్ర.న్యూస్ : మిడిల్ ఈస్ట్‌లో (Middle East) మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ (Ali Khamenei) అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే.. ఆయన కుమారుడు, కొత్త సుప్రీం లీడర్ అయిన మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) సంచలన ప్రకటన చేశారు. తన తండ్రి మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన శపథం చేశారు.

ప్రతీకారం.. ఇరాన్ ప్రజల డిమాండ్

దేశ ప్రజలు కోరుకుంటున్నట్లుగానే ఈ దారుణానికి ఒడిగట్టిన నేరస్థులపై రివెంజ్ (Revenge) తీర్చుకుంటామని మొజ్తబా ఒక లిఖితపూర్వక సందేశంలో తెలిపారు. మరోవైపు శుక్రవారం నాడు మషద్ నగరంలోని ఇమామ్ రెజా క్షేత్రం వద్ద అలీ ఖమేనీ అంత్యక్రియలు భారీ జనసందోహం మధ్య ముగిశాయి. అయితే, కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మొజ్తబా ఇప్పటివరకు పబ్లిక్ గా కనిపించకపోవడం గమనార్హం.

కాల్పుల విరమణ ముగిసింది: డొనాల్డ్ ట్రంప్

ఈ తాజా ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ (Ceasefire) ముగిసిపోయిందని స్పష్టం చేసిన ఆయన.. అయితే ఇరాన్ కోరిక మేరకు వారితో చర్చలు జరిపేందుకు అమెరికా అంగీకరించిందని 'ట్రూత్ సోషల్' (Truth Social) వేదికగా వెల్లడించారు. ఇటీవల ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా జరిపిన రెండు రోజుల భీకర దాడుల్లో సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.

అమెరికా వార్నింగ్.. కొత్త ఆంక్షలు

హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) నావిగేషన్ స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ.. వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో (Marco Rubio), సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ఫోన్‌లో చర్చించారు. అంతేకాకుండా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబాకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఓ కీలక ఫైనాన్షియర్‌తో సహా 13 మందిపై అమెరికా శుక్రవారం కొత్త ఆంక్షలు విధించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఒమన్ చేరుకుని చర్చలు జరుపుతున్నారు.

టెహ్రాన్‌లో పేలుళ్ల కలకలం

ఇదిలా ఉండగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. ట్రంప్ హత్యకు కుట్ర ఆరోపణల నేపథ్యంలో ఈ పేలుళ్లు జరగడం టెన్షన్ పెంచింది. అయితే, భయపడాల్సిన పనిలేదని.. ఇవి కేవలం పాత పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేసే 'కంట్రోల్డ్ ఆపరేషన్' (Controlled operation) లో భాగమేనని ఇరాన్ అధికారిక మీడియా ఫార్స్ (FARS) న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

Advertisement
Advertisement